పుట:Andhra bhasha charitramu part 1.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలను బోల్చికొనవచ్చును; అయినను అట్టి వానిసంఖ్య యెక్కువగానుండదు. కావున వానిలో గొన్ని యన్యదేశ్యములును దక్కినవి తద్భవములు నయి యుండవలెను. కొన్నిటికి వ్యుత్పత్తిని నిఋనయించుటయే కష్టము కావచ్చును. అట్టి వ్యుత్పత్తి నిర్ణయము చేయవీలులేని పదములను దేశ్యములక్రింద పరిగణించుట ప్రాకృత వైయాకరణ సంప్రదాయమేకాక యాధుని కార్యభాషలని పిలువబడు భాషలకు వ్యాకరణములను నిఘంటువులను వ్రాసినవా రనుసరించిన సంప్రదాయము కూడనై యున్నది. పండిత హరిగోవిందదాసశ్రేష్ఠ విరచిత 'పాఇఅ సద్దమహణ్ణవో' (ప్రాకృతశబ్ద మహార్ణవము) అనుబృహన్నిఘంటువున 38190 పదములు చేరినవి. వీనిలో సుమారు 8000 పదములు కేవల రూపాంతరములు. మిగిలిన 30000 పదములలోను హేమచంద్రవిరచిత ప్రాకృతదేశీనామమాలలోని 5518 దేశ్యపదములును చేరినవి. అనగా నూటి కించుమిం చిరువదిపదములు దేశ్యములు. కాని, హేమచంద్రు డిచ్చిన పదములన్నియు దేశ్యములగునా యని భాషాశాస్త్రజ్ఞులు సందేహించుచున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనలవలన వీనిలో ననేకములు దేశ్యములు కావని నిరూపింపబడినవి. ప్రాకృతముకంటె తెనుగు నేటి కింకను, సుమారు పదునేను శతాబ్దములయినను తర్వాతిది తావున నది ప్రాకృత భాషావికారమర్ యైనచో తొల్లిటి ప్రాకృతావస్థనుండి యెంతో పరిభ్రష్టమై వికారము నొందియుండవలెను. తెనుగు వైయాకరణులందఱును నాంధ్రభాష సంస్కృతప్రాకృతముల వికృతియని యంగీకరించియున్నారు. ప్రాచీనాధునికి ప్రాకృతములు సంస్కృతాది ఇండోయూరోపియను భాషలతో సంబంధము గలవని యంగీకరించిన విషయమే. వానిలో మూలముతో సంబంధము లేదని తమకు దోచిన యనేకపదములుండుటచే వాని ప్రాకృతత్వసిద్ధికి భంగము కలుగనేరదు. దేశ్యశబ్దములకు బ్రాకృతాది భాషలతో గల సంబంధమును గూర్చి విపులముగ పరిశోధనము జరిగియుండలేదు. ప్రాచీనాధునికాంధ్ర వైయాకరణులందఱును నాంధ్రభాష సంస్కృత ప్రాకృతముల వికృతియని చెప్పి, కొన్ని యుదాహరణములను మాత్ర మిచ్చుటతో తృప్తినొందిరి. ఈ మధ్య బయలువెడలిన కాల్డువెల్లువ్యాకరణ మింగ్లీషులో నుండుటచే నది మన పండితుల కందుబాటులో లేకపోయినది. దానిని గొంతవఱకు నవగాహన చేసికొని యొకరిద్దఱు పండితులు మాత్రము పూర్వాంధ్రవ్యాకరణ సంప్రదాయమును విసర్జించి, ఆ సంప్రదాయముయొక్క తత్త్వమును లోతుగ నాలోచింపక యొక్కసారిగ కాల్డువెల్లు నభిప్రాయములను బ్రచారములోనికి దెచ్చుటకు బూనినారు. కాల్డువెల్లు నభిప్రాయమును తప్పక యాలోచింప వలసినదే; కాని, యంతటితో నూరకుండరాదు. ఆంధ్ర












`ర