పుట:Andhra bhasha charitramu part 1.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాసగణములచే నిరూడములైన పదములకును, దక్షిణహిందూదేశ శాసనావళి (South Indian Inscriptions) IV, V, VI, సంపుటములలో దొరకిన పదములకును నాశ్వాసాది సంఖ్య లీబడినవి. ఈ పట్టికలో X అను గుఱుతుగల పదము శ, ర. లో నియ బడినది కాదనియు, V అను గుఱుతు అప్పకవికూడ నుదాహరించెననియు, V అనునది యితర విధముల బట్టికలో జేరినదనియు, బ్రత్యేకముగ నంకెలుండినచో నవి శాలివాహనశకవత్సర సంక్యలనియు, రోమనుఅంకెలును పిదప నింగ్లీషు అంకెలును నున్నచో నవి దక్షిణ హిందూదేశశాసనసంపుటముల సంక్యయు నందలి శాసనసంఖ్యయుననియు దెలియవలెను. పదముతరువాత నెట్టి యంకెయు లేకున్నచో దానియం దనుస్వారమున్నదనుటకు నిఘంటుకారుడు తప్ప మఱి యెట్టి ప్రమాణమును లేదని తెలియవలెను.

ఈ క్రింద జూపిన పదములందలి యర్ధానుస్వారములు ప్రాసస్థలములందుండుటచేతను నాయా పద్యముల గణానుసారముగ నవి నిండుసున్నలగుట చేతను, శాసనములందునుస్వారయుతములుగ గాన్పించుటచేతను యర్ధానుస్వారములు గలవిగ నిర్ణయింపబడినవి.

ఁక.

ఆక (ద్రోణ. I. 201; నిర్వ. VII; హరి. పూ. VII. 13 నృసిం. IV. 113; కుమా II. 849); అఱ్ఱాఁక (కాళ. III, కాశీ Vii); ఆకరము (ఆది. VIII. 203; రా. యు కాం.), ఆకలి (ద్రోణ II. 19, నృసిం. IV. 113; బసవ. 48); ఇక (ఆర. I.); ఊఁకర (బసవ. 239 పు. 10 పంక్తి; 160 పు.); ఏకట (భీమ. II; మను. III), ఏకరు (రుక్మా. IV); కడక (విక్ర. III); కణక (భాగ V); కాక (జై. I); కాఁకర (బహులా. IV. *49); కూక (శేష. I.); కూఁకట (పండితా. 371 పు; కళా. I); జూఁక (భీమ. IV. 4-వ. అనుప్రాసము); తోఁక (భాగ. VIII; పండితా. 343 పు; బసవ. 288 పు. 22 పం.), నాయఁ(౦)కరము (పాండు. I; శా. శ. 1440, 1453); నూంకమ (శా. శ. 1074); పోఁక (కుమా. II. 89; శా. శ. 1021, 1072, 1087, 1094, 1191; ద. ఇం. శా. IV. 102; V. 65); పోకముడి (ఉ. రా. VI); ప్రోఁక (పండితా. 72 పు; బసవ. (174 పు. 5 పం.); మలఁక (కాశీ V), మాంకన (శా. శ, 1156); మాంకను (శా. శ. 11) మూఁక (ఆది VIII. 203; ద్రోణ. II.136; ద్రోణ. III. 263; పండితా. 278 పు; బసవ. 29 పు. 130పు. 22పం; 160 పు. 11 పం); మేక (బసవ. 97 పు. 6పం; శా. శ. 1152. 1178); మోకరించు (బసవ. 224 పు. 1 పం); మోకఱిల్లు (భాగ. VIII),