పుట:Andhra bhasha charitramu part 1.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లందును నర్ధబిందువుగాని, యఱసున్నగాని కాన్పింపదు. పై జెప్పినట్లు నిండుసున్నయే వాడుకయందుండెడిది; హల్లునకు ద్విత్వమును గల్పించుటచే నొకప్పుడు పూర్ణానుస్వారోచ్చారణమును దెలుపుచుండెడివారు. వ్రాయసకాండ్రర్ధానుస్వారము నుచ్చరింపనిపట్ల నెట్టి గుఱుతును నుపయోగించెడివారు కారు.

సిద్ధానుస్వారమనగా నాంధ్రమున నా శబ్దము వెలసిన నాటనుండియు శబ్దములందు గనబడుచున్న యనుస్వారము. సిద్ధపూర్ణానుస్వారమున కుదాహరణములు: పొంకము, ఇంతి; పొందు, సొంపు, మొద. సిద్ధార్ధానుస్వారమున కుదాహరణములు: వెలది, చెలగు,తలచు మొద.

సాధ్యానుస్వారమనగా సంధి, సమానాది కార్యములచే శబ్దములందు గలుగు ననుస్వారము. ఇది సకారమకార స్థానములందు గూడరావచ్చును. సాధ్యపూర్ణానుస్వారమున కుదాహరణములు: క్రొంబసిడి, పందొమ్మిది, అందదుకు, కందొవ, చెంగల్వ, తళుకుంగజ్జలు, తలంబ్రాలు, పెనుగొండ, సంగోరు:- కెందమ్మి, చెంగలువ, ముంగొంగు, వంజెఱగు - మొదలగు శబ్దములందు పూర్ణానుస్వారము మొదటి నుండియు నున్నది. గావున వానిని సాధ్యపూర్ణానుస్వారమున కుదాహరణములుగ నిచ్చుట తగదని తోచుచున్నది.

సాధ్యార్ధానుస్వారము ద్రుతము స్థానమునను, గొన్నియెడల సాధ్యపూర్ణానుస్వారమునకు బదులుగను వచ్చుచుండును:- జలజాక్షుగొలుతు; తలబ్రాలు మొద.

ప్రాకృతములందును నేటి యార్యభాషలయందును ననుస్వారమేహల్లునకై నను బూర్వమందు రావచ్చును. తెనుగుననది పరుషసరళములకు బూర్వమందే కాన్పించును. తెనుగున మహాప్రాణములు లేవుగావున వానితో బ్రసక్తిలేదు.* య, ర, ఱ, ల, వ, స, హ, ళ లకు బూర్వమున దెనుగున బూర్ణార్ధానుస్వారములు రెండును నుండవు. 'న, మ' లకు బూర్వమందనుస్వారసంజ్ఞనుంచి వ్రాయునాచారము, తాళపత్రగ్రంథములందు గానవచ్చుచున్నది. అంన్నా, అంమ్మ మొద.

దీర్ఘముపై నున్నది యర్ధానుస్వారముగాని పూర్ణముగాదు. అర్ధానుస్వారము 'అట, ఇక, చుడు' అనువానిలో దప్ప బదముల తొలియచ్చుపై గాన్పింపదు.

తెనుగు పదములందలి యర్ధానుస్వారమును నిర్ణయించుట కయిదు మార్గములున్నవి. (1) ఆ పదములందలి యర్ధానుస్వారముతో గూడిన హల్లు పద్యముల ప్రాపస్థానమందు గనబడుట; లేదా' పద్యగణము సరిపోవుట కర్ధా