పుట:Andhra bhasha charitramu part 1.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నున్నవనియు నాంధ్రశబ్ద చింతామణికారుడు తెలిపెను. ఒకప్పు డీ యనుస్వారమును బిందువని కొందఱు చెప్పుదురని యాతడే వచించెను. అప్పకవి పూర్ణానుస్వారమునకు దీర్ఘానుస్వారము, అఖండానుస్వారమనియు, నర్ధానుస్వారమునకు హ్రస్వానుస్వారమనియు బేళ్ళుగల్పించెను. అప్పకవి కల్పించిన యీదీర్ఘ, హ్రస్వసంజ్ఞ లనుస్వారవిషయమున దార్మాఱయినట్లు దోపకపోదు. 'రెండ్డు' అనునప్పుడు హ్రస్వముగను, రేండు అనునప్పుడు దీర్ఘముగను ననుస్వారము వినబడుచున్నది. హ్రస్వాచ్చుమీది యర్ధానుస్వారమును దీర్ఘముగానే వినబడును. పెనంగు, తొలంగు మొద అర్ధానుస్వారమనునది దీర్ఘము కావుననే యొక శబ్దములోని పూర్ణానుస్వార మర్ధానుస్వారమగు నపుడు పూర్వాచ్చునకు దీర్ఘము కలుగుచున్నది.

అనుస్వారమును గొందఱు బిందువని చెప్పుచున్నారను శబ్దానుశాసనుని వచనమున కప్పకవ్యాదులు తమకాలపు సంప్రదాయము ననుసరించి వ్యాఖ్యానము చేసికొనిరి బిందువనగా బొట్టనియు, సున్నయనియు నప్పకవి వ్రాసెను. బొట్టనగా జుక్క, పూర్వకాలమున ననగా బండ్రెండవ శతాబ్దమువఱకును ననుస్వారము జుక్కగనే వ్రాయుచుండెడివారు. ఆ చుక్క నక్షరమునకు బ్రక్కగాకాక తలపై నిలుపుచుండెడివారు. రానురానది వ్రాతయందు ప్రక్కకు జేరికొనుటయేకాక నిండుసున్నగకూడ బరిణమించినది. రాజరాజనరేంద్రుని కాలమున ననుస్వారమును వ్రాయునట్లు నను నాసికాక్షరములనే చాలవఱకు వ్రాయుచుండెడివారు: డఙ్కలపూణ్డి, జరిపిఙ్చువారు; పూణ్డ; మీంద; మొద బిందువును దలపై వ్రాయునాచారమును నాకాలమున నుండెను. తరువాతి కాలమున బూర్ణానుస్వారమును వ్రాయవలసినప్పుడు సున్న పెట్టి దానిమీదిహల్లునకు ద్విత్వ మిచ్చుచుండెడివారు. ఇంద్దుల, ఇంక్క; మొద. ఖండానుస్వారమును దెలుపుటకు ద్విత్వములేని హల్లునుమాత్రము వ్రాయుచుండెడివారు; ఇంక మొద. ఈ యాచారమన్ని శాసనములందును నొక్కతీరునలేదు. చూ మూణ్డికి, ఒకణ్డికి మొద.

సంస్కృతమునందలి ఖండానుస్వారమును దెలుపుట కక్షరముతలపై 'రంగవల్లి' యను నర్ధచంద్రాకృతిగల గుఱుతు నుంచువాడుక గలదు.

ఓ; సంస్కరోతి; మొద. ఇట్టి గుఱుతును దెనుగున నర్ధానుస్వారమునకు వాడుచుండిరో లేదో తెలిసికొనుట కాధారము లులేవు. అర్ధానుస్వారమున కఱనున్న - అనగా 'c' అను చిహ్నమును వాడుట చాల నవీనాచారము. తెనుగునకు ముద్రణసౌకర్యములు కలిగినతరువాత ని గుఱుతేర్పడినదని చెప్పవచ్చును. ప్రాచీన శాసనములందును దాళపత్రగ్రంధము