పుట:Andhra bhasha charitramu part 1.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెనని వారి ప్రశ్న. బియ్యపుగింజపై సీసపద్యమును చిత్రించుట, భగవద్గీతాధ్యాయములను సన్నని తాటియాకులపై వ్రాసి, పాసలుకట్టి, జపమాలగ నేర్పఱచుట, మొదలగు రీతులవ్రాత నుపయోగించినవారు, తెనుగువర్ణములను సంస్కరింపనెంచుట హాస్యాస్పదముగ గణింపకమానరు. గుండ్రని యక్షరములను వ్రాయుట ఎక్కువశ్రమ, యెక్కువ కాలహరణము, అను మొదలగు నసౌకర్యములు వారిదృష్టిలోనంత యెక్కువ యైనవి కావు ఈరెండు దృష్టులకును వైర మీ వ్రాత విషయముననే కాక సర్వ విషయములందును గలదు. ఈ పోరాటములో వ్యవహారదృష్టికి విజయము కలుగుననుటకు సందియములేదు. లోకములో నందఱును గళాప్రియులును బండితులును గాజాలరు. వారికీవివాదముతో నంతగ బనిలేదు వ్యవహారమున నేదిమిక్కిలి యుపయోగకరమో వారు దానినే యనుసరింతురు పండితులును గొన్నాళ్లకు వారి దారినే పట్టుదురు. వెలుపల గిలుకరించుట యిప్పుడు చాలమట్టు కంతరించినది. ఎన్నడును భాషలోలేని యరసున్నకు 'c' అను గురుతేర్పడినది. ఇట్టివెన్నియో యిటీవల గలిగినమార్పులే పండితుల కాదరణ పాత్రములైనవి. దంత్య చ, జ, లపై రెండంకె నుంచకుండిన గోపించువా రెందఱో కలరు. ఈ మార్పు చాల నవీనమైనదైనను వారి దృష్టినది యుచ్చారణ భేదమును దెలుపుటకు జాలనావశ్యకము; కావున వారు దానిని పరిగ్రహించినారు; ఆగుఱుతు ప్రాచీనమైనదని వారు తలంచుటమాత్రమే వింత

ఆంధ్రలిపి సంస్కార మెట్లు జరుగవలెనను ప్రశ్నముతో నాంధ్రభాషా చరిత్రమునకు బనిలేదు కలిగినమార్పులను గుర్తించుటయు, నున్నస్థితిని నిరూపించుటయునే దానిపని.

II.

ఆంధ్రధ్వనులు.

సంస్కృతభాషకు వర్ణము లేబది. అందచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ, ౦,:, అని పదునాఱు వీనిలో ౡ కారము లేదని పాణినినుతము.:క (జిహ్వా మూలీయము), :ప (ఉపధ్మానీయము) లచ్చులలో ౙరనలెనని కొందఱిమతము. హల్లులు క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, - అని ముప్పదినాలుగు. వీనిలో

____________________________________________________________________

  • భాషాధ్వని మూలము. అర్థవంతములైన ధ్వనులే భాష. కాని వైయాకరణు లాయా ధ్వనులను వర్ణము లనుచున్నారు. 'వర్ణ' అంజ్ఞ లిఖితాక్షరమునకు మాత్రము చెల్లినను పూర్వమర్యాద ననుసరించి యాసంజ్ఞయు గ్రహింపబడినది.