పుట:Andhra bhasha charitramu part 1.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. ఫ - కారమును గేవల స్పర్శముగ గొందఱుచ్చరింపరు; ప్రపుల్ల, కఫము, మొదలగుశబ్దములను గొందఱు 'ప్రఫుల్ల, కఫము,' అని యుచ్చరించుట గలదు.

10. పదమధ్యాంతములందు గల 'ము' వర్ణము కొన్ని ప్రాంతములలో ననునాసికీక్ర్త 'వు'వర్ణముగా వినబడుచున్నది. చెవుడు, రావుడు, వావు, పావు.

11. 'హ్ల' - వర్ణమును చదువుకొనని తెనుగువారును, చదువుకొనిన వారిలో గొందఱును 'వ్ల, ౦వ్ల, మ్ల, ఫ్ల'లుగా నుచ్చరింతురు. ప్రహ్లా (ప్రవ్లా, - ౦వ్లా, - మ్లా - ఫ్లా' దుడు; ఆహ్లా (-వ్లా. - ౦వ్లా, మ్లా)దము.

12. 'హ్వ' - వర్ణమును, గొందఱు 'వ్హ'గను, గొందఱు 'వ్వ'గను నుచ్చరింతురు: గహ్వ (-వ్హ-గ ప్‌ఫ(రము.

13. 'హ్మ' - దీనిని 'మ్హ' , 'మ్మ'లుగా నుచ్చరించుట గలదు: బ్రాహ్మ (-మ్హ,-మ్మ)ణుడు.

14. 'సీ' వర్ణమును గొందఱు 'శీ'గ వ్రాయుదురు: సీతారామయ్య.

15. పూర్ణానుస్వారముపై వచ్చు హల్లునకు గొందఱు ద్విత్వమిచ్చెదరు; కొంద ఱీయరు: అనంతరావు, అనంత్తరావు.

పై వివరించిన దానిని బట్టి యాంధ్రలిపి యన్ని కాలములందును నొకటే రూపముగలిగి యుండలేదనియు, నందలివర్ణము లన్నియెడలను నాయాధ్వనులను సరిగ నిరూపింప కున్నవనియు, లిపి యొక తెన్నున లేకుండుటచే దానిని నేర్చికొనుట చాల గష్ట సాధ్యమనియు, నందు మూలమున విద్యావ్యాప్తి కాటంకము గలుగుచున్నదనియు, దానివలన వ్యవహార సౌకర్యము, సంపూర్ణముగ జేకూరకున్నదనియు గొందఱనవచ్చును. సంస్కార ప్రియులును, వ్యవహారమే ముఖ్యమని తలంచువారును దానిని సంస్కరింప బ్రయత్నింపవచ్చును. సంస్కార ప్రియులకును, సంస్కార విముఖులకును వారివారి దృష్టులలో భేదముండుట బట్టి వారిరువురికిని సామరస్యమును గుదుర్చుట కష్టము. ఒకరికి లిపి యొక సాధనము మాత్రము, ఆ సాధనము వ్యవహారమున కెంత బాగుగ నుపయోగించిన నంతమేలని వారియభిప్రాయము. రెండవవారి కది పూర్వులు తమకొఱకు దాచిపెట్టిన యందముల రాశి; వ్రాతయనున దొకకళ, మనోహరములగు నూహలను దాచుటకు మనోహరములగు నక్షరపు బరణులు గావలెను. తెనుగక్షరములు ముక్తాఫలములవలె గుండ్రముగ నుండవలెనని వారి యభిప్రాయము. అవి ఎల్లప్పుడును గుండ్రముగాలేవని శాసన పరిశోధకులు దెలిపిన, వారునమ్మరు; నమ్మినను చక్కబడినదానిని దిరుగ నేల పాడుచేయ