పుట:Andhra bhasha charitramu part 1.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


51. కుడుచు.

విశేష్యముపై: ఉడ్డుగుడుచు, ఊలమాలగుడుచు, తల్లడ-;

బహువచనరూపముపై: నకనకలుగుడుచు.

52. కుడుపు.

విశేష్యముపై: ప్రోల్గుడుపు.

53. కునియు.

బహువచనరూపముపై: తుంపెసలుగునియు.

54. కుఱు.

విశేష్యముపై: చేకుఱు.

ఉపసర్గ ప్రతిరూపముపై: సమకుఱు

55. కూడు.

విశేష్యముపై: చేకూడు.

ఉపసర్గప్రతిరూపముపై: ఒడగూడు, ఒనగూడు, తలకూడు; సమకూడు

56. కూయు.

బహువచనరూపముపై: పింపిళ్లుగూయు.

57. కూరు.

విశేష్యముపై: చేకూరు.

ఉపసర్గ ప్రతిరూపముపై: సమకూరు.

58. కూరుచు.

ఉపసర్గ ప్రతిరూపముపై: సమకూరుచు.

59. కొట్టు.

విశేష్యముపై: అండ-; ఉఱు-; కడ-; కనుపు-; కిల-; కెర-; కొల్ల-; గిల-: చీ- (దీనిపై జేరునపుడా ద్యచ్చునకు హ్రస్వమును కకారమునకు ద్విత్వమును గలిగి 'చిక్కొట్టు' అనియునగును); చాగఱ-; చుచ్చు-; జిఱ-; త్రెక్కు- (దీనిపైనొక కకారము లోపించి 'త్రెకొట్టు' అనియగును.); దిసంతు -; నట్టు-; నడ-; నౌడు-; పిడి-; పొడి-; బల-; బుస-; బెక్కు-(చూ. త్రెక్కు);

ii. తుమున్నర్థక రూపములపై: ఎండ; - చెంగ -; తెగ. పగుల-; పో.

iii. క్రియవై: రా.