పుట:Andhra bhasha charitramu part 1.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. ఒగ్గు.

విశేష్యముపై: పోటొగ్గు.

31. ఒడుచు.

బహువచనరూపముపై: ఓగులొడుచు.

32. ఒడ్డు.

విశేష్యముపై; మాఱొడ్డు, ఎదురొడ్డు, మెండొడ్డు, వఱ్ఱొడ్డు.

33. ఒత్తు.

విశేష్యముపై: అచ్చొత్తు, ఇగురొత్తు, ఎదురొత్తు, చిగురొత్తు, తళుకొత్తు, పోకొత్తు, మాఱొత్తు.

బహువచనరూపముపై: కడలొత్తు, కొనలొత్తు.

34. ఒందు.

విశేష్యముపై: వెఱగొందు, వెలుగొందు.

35. ఒనర్చు.

విశేష్యముపై: జంకె-;

36. ఒడు.

విశేష్యముపై: మొగము-; మోము.

37. ఓపు.

విశేష్యముపై: చూపు.

38. ఓము

విశేష్యముపై: పురులు.

39. కట్టు.

విశేష్యముపై: అచ్చుకట్టు, అడ్డకట్టు, అరికట్టు, ఆకట్టు=ఆక+కట్టు; ఉఱ్ఱు-; ఒడి-; కడ-; కరుడు-; గర-; చెట్టు-; జడ-; తడ-; తుట్టె-; తూట-; తూటు-; తెట్టువ-; దడ-; దాటు-; దాయ-; దీటు-; దోయి-; పిండు-; పూదె-; పూవు-; పెంట-; పెట్ర-; కొలికి-; పొడ-; బిల్ల-; మల్లు-; మొగ-; మొన-; మొలక-; మోద-; వల-(=వలను)-; వెల్లువ.

బహువచనరూపముపై: తిరువులు-; తెట్టెలు.