పుట:Andhra bhasha charitramu part 1.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెన్నుండు (*తెన్ని+ఉండు); తొన్నుండు (*తొన్ని+ఉండు); పన్నుండు (*పన్ని+ఉండు).

20. ఉబ్బు.

ఏకవచన రూపముపై: పుటముబ్బు.

బహువచన రూపముపై: క్రేళ్ళుబ్బు.

21. ఉఱు.

విశేష్యముపై: పెలుకుఱు, పెల్కుఱు.

22. ఉఱుకు.

ఏకవచన రూపముపై: చెమ్మయుఱుకు.

విభక్తి రూపముపై: కొఱతనుఱుకు.

బహువచన రూపముపై: క్రేళ్లుఱుకు.

తుమున్నర్థక రూపముపై: డిగ(గ్గ) నుఱుకు.

23. ఊగు.

బహువచన రూపముపై: ఉఱ్ఱటలు-, ఉఱ్ఱట్లు-, ఉఱ్ఱూతలు.

24. ఊరు.

ఏకవచన రూపముపై; నోరూరు, ముక్కూరు, వాలూరు.

బహువచన రూపముపై; ఉవ్విళులూరు.

25. ఊరుచు.

అవ్యయముపై; నిట్టూరుచు.

26. ఎక్కు.

విశేష్యముపై; దుద్దెక్కు.

27. ఎగయు.

విశేష్యముపై: పుటమెగయు.

28. ఎత్తు.

విశేష్యముపై: తలయెత్తు, తూరుపెత్తు, దండెత్తు, నోరెత్తు, పరుగెత్తు, పేడెత్తు, మొలకెత్తు, రేకెత్తు.

29. ఏగు.

విశేష్యముపై ; ఎదురేగు.