పుట:Andhra bhasha charitramu part 1.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

I. భావార్థము.

(అ). ఆకులపాటు, ఆయాసపాటు, ఆయిత (త్త) పాటు, ఆరటపాటు, ఆసపాటు, ఇక్కుపాటు, ఇడుమపాటు, ఉత్తలపాటు, ఉదిరిపాటు, ఉలికిపాటు, ఎగసిపాటు, ఎదురుపాటు, ఏమఱుపాటు, ఏరుపాటు, ఏర్పాటు, ఒంటరిపాటు, ఒంటిపాటు, ఒడబాటు, ఓటుపాటు, ఓరపాటు, కట్టుపాటు, కప్పరపాటు, కలకపాటు, కష్టపాటు, కాలవళపాటు, కింకిరిపాటు, కుతిలపాటు, కుదురుపాటు, కునికిపాటు, కొంకుపాటు, కొందలపాటు, కోలుపాటు, గగురుపాటు, గరుపాటు, చిందిలిపాటు, చిక్కుపాటు, చిడిముడిపాటు, చులుకపాటు, చేడ్పాటు, జాఱుపాటు, డిందుపాటు, తక్కువపాటు, తత్తరఱపాటు, తలపాటు, తిరుగుడుపాటు, తీఱుపాటు, తొంగలిపాట్లు, తొక్కటపాటు, తొట్రుపాటు, తోడుపాటు, తోడ్పాటు, త్రొక్కటపాటు, త్రోపాటు, దండపాటు, దిగులుపాటు, దిద్దుపాటు, దు:ఖపాటు, నివ్వెఱపాటు, పైపాటు, పొందుపాటు, బొమముడిపాటు, భంగపాటు, మాఱుపాటు, మిట్టిపాటు, రాలుపాటు, ఱెప్పపాటు, లంకెపాతు, వీడుపాటు, వెక్కసపాటు, వెడగుపాటు, వెనుకపాటు, వెఱగుపాటు, వేగపాటు, వేగిరిపాటు, వేఱుపాటు, సాగుపాటు, సాపాటు, సిగ్గుపాటు.

(ఆ). ఈక్రింది వానిలో సరళాదేశము కలిగినది.

ఎడబాటు, ఒల్లబాటు, కనుబాటు, జరుగుబాటు, తడబాటు, తెగబాటు, నగుబాటు, నవ్వుబాటు, మరలబాటు, విఱుగబాటు, వెడలబాటు. వెనుబాటు, గబ్బాటు, దెబ్బాటు.

(ఇ). ఈక్రింది వానిలో 'వ' కారమాదేశముగ వచ్చినది.

ఎరువాటు, ఒదుగువాటు, తగులువాటు, తిట్టువాటు, చీవాట్లు, దిగువాటు, పిడివాటు, పువ్వాటు, పూటవాటు, బడిసివాటు, బ్రుంగుడువాటు, ముడివాటు, ఱిచ్చవాటు, వలెవాటు.

(ఈ). ఈక్రింది వానిలో 'పాటు' విశేషార్థములను దెలుపును.

i.విధము, రీతి:-

ఆదోకపాటు, ఒల్లెవాటు, గ్రుడ్డివాటు.

ii. కృషి: పొలము పాటు.

iii. పొందుట ; ఫలముపాటు.

iv. మార్గము ; వెనుకపాటు.

v. వైచుట ; గిరివాటు.

vi. కొట్టుట ; తెరువాటు.