పుట:Andhra bhasha charitramu part 1.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


11. తనము. వేదము: త్వనమ్: ప్రా. త్తణమ్.

దీనిని సాధారణముగా భావార్థమునం దన్ని విశేష్య విశేషణములతోడను జేర్పవచ్చును. ఉదా: అత్తగారితనము, ఊరకుండుతనము, మంచితనము, చెప్పరానితనము, ఎఱ్ఱదనము, మొ.

అఱగొండెతనము, కనుకుట్టుదనము, కలితనము, ప్రల్లదనము, మకురుతనము, వడికలతనము, కుక్కతనము (ఉ. రా పు. 124); బండతనము (చెన్న బ. I. 36) గోరతనము (కాశీ. IV. 91) కొయ్యతనము (కాశీ. IV. 94.)

12. - తరము ; వేదము : త్వరమ్.

పడితరము.

13. - తల ; వేదము: త్వన.

i. భావార్థము:-

అగుదల, అచ్చుదల, ఒరుదల, కూడుదల, కొనుదల, కోలుతల, కోల్తల, క్రమ్ముదల, చుట్టుదల, తగులుదల, తగ్గుదల, తప్పుదల, తాకుదల, తిరుగుదల, తీఱుదల, తెగుదల (నిర్వ. IX. 53), దిగుదల, పట్టుదల, బాడుదల, మందల, మించుదల, మూదల, మోపుదల, వాడుదల, విడుదల, ఎగుదల.

ii. ప్రదేశార్థము:

అవతల, ఇవతల, ఈతల, ఎగుదల, క్రిందల, బిత్తల, ముందల, విడిదల.

14. - తెర ; వేదము:

ఏడ్తెర, మొద.

15. -పు; సం. త్వ. - వేదము: త్వన

సాళగింపులు (పాండు. iii. 43.)

16. - పట్టు; సం. - ప్రస్థ. చూ, ఇంద్రప్రస్థ, మొద.

ఆటపట్టు, ఇంటిపట్టు, ఇంతపట్టు, ఏలముపట్టు, చేపట్టు, పిచ్చపట్టు; పెంటపట్టు, రచ్చపట్టు, విడిపట్టు, వింటిపట్టు, వీడుపట్టు.

17. - మట్టు ; సం. - ప్రస్థ.

విడిమట్టు.

18. - పెట్టు : సం. - ప్రహత?

పోబెట్టు.

19. - పాటు ; సం. - పాత.