పుట:Andhra bhasha charitramu part 1.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


20. - పోక; సం. - ప్రగ.

ఆపోక, కోలుపోక, బమ్మెరపోక, వేగు బోక, వేబోక, వాపోక,

21. - పోటు; సం. ప్రహతం.

బందిపోటు, విరిపోటు.

22. - బడి; - సం. - వత్ + ఇక; వృత్తి.

i. భావార్థము:-

ఏలుబడి, ఒదవుబడి, ఒదుగుబడి, కట్టుబడి, కనుబడి, కొనుబడి, గిట్టుబడి, చెల్లుబడి, చేరుబడి, చాలుబడి, జరుగుబడి, తగులుబడి, తీరుబడి, దిద్దుబడి, పట్టుబడి, పలుకుబడి, పుట్టుబడి, పెట్టుబడి, పోబడి, మొక్కుబడి, మ్రొక్కుబడి, రాబడి, రోనుబడి, వచ్చుబడి, వఱబడి, వీసబడి, వెంబడి, సరబడి, సాగుబడి.

ii. తరబడి = తరముమార్గమున.

iii. కోడిబడి = పిల్లలభక్ష్య విశేషము.

23. - - వడి; సం. వత్ + ఇక; వృత్తి.

i. భావార్థము:-

ఇలు (ల్లు)వడి, ఉరవడి, (ఇదితప్పు, 'నరవడి' ఒప్పు), కైవడి, కొలువడి, చలువడి, తరువడి, నడవడి, నడువడి, పరువడి, మెఱవడి, మే(మై)వడి, లేవడి, ఆవడి, హావడి.

ii. సరవడి = ఎడ్లనుకట్టి చొప్ప మొదలగు వానిని తీసికొనిపోవు సాధన విశేషము.

24. - వణి; సం. వత్ + ఇక; వృత్తి

పటవణి, లవణి, లావణి.

25. - వళి; సం. - వత్ + ఇక ; వృత్తి.

ఆ (హా) వళి.

26. - మతి; సం. - మత్ + ఇక; వృత్తి; మతి;

ఎగుమతి, దిగుమతి.

27.- మర ; ప్రా. -అర - కలిగినది; మతి.

విడుమర.