పుట:Andhra bhasha charitramu part 1.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గరగడ, తలగడ, తల్గడ (తలాడు).

3. - కర; సం. - కృత.

ఉడుగర, విడుగర.

4. - కల; సం. - కృత.

ముంగల, పెనుకల (పెనుకాల).

5. - కాటు; సం. - కృత.

వాకాటు.

6. - కాయ; సం. - కా + అకా.

తలకాయ, తిప్పకాయ, పిల్లకాయ, పెఱగాయ, బుఱ్ఱకాయ, చంపకాయ, మొట్టికాయ, బుఱ్ఱకాయ, రాలుగాయ, లింగకాయ, లెంపకాయ, లొట్టకాయ, సున్నపుగాయ, గుండెకాయ, నీరుకాయ.

7. కొట్టు; సం. - కుట్ట్.

సుడిగొట్టు.

8. - కోలు; సం. - కృత.

'కొను' సహాయక్రియ గాగల యన్నిక్రియల నుండియు 'కోలు' అనుస దంతమందుగల భావార్థక విశేష్యములు పుట్టును. శబ్దరత్నాకరమున నీ క్రిందివి చేర్పబడినవి.

ఆడికోలు, ఇచ్చిపుచ్చికోలు, ఇయ్యకోలు, ఈకోలు, ఈయకోలు, ఎత్తికోలు, ఎదురుకోలు, ఏటికోళ్లు, ఒప్పుకోలు, కలుపుగోలు, కొనుగోలు, చూఱకోలు, తగులుకోలు, తలకోలు, త్రెక్కో, దక్కోలు, దిగ్గోలు, దీకోలు, డీకోలు, దొరకోలు, నాచికోలు, నూలుకోలు, నెక్కోలు, నొచ్చుకోలు, పట్టుకోలు, పుచ్చుకోలు, పెట్టుకోలు, పేరుకోలు, పేర్కోలు, పొగడికోలు, ప్రబ్బికోలు, ప్రోచికోలు, బడికోలు, ముట్టుకోలు, మునుకోలు, మెయికోలు, మేకోలు, మేలుకోలు, మైకోలు, రెక్కోలు, రౌలుకోలు, విడిగోలు, వీడుకోలు, వీడ్కోలు, వెన్నెలకోలు, వేడుకోలు.

9. - గరము; సం. - కృతమ్.

ఉలగరము, చెడగరము.

10. తట్టు; సం. - తష్ట.

విరిదట్లు.