పుట:Andhra bhasha charitramu part 1.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాఱుడు, దిగు(గ్గు)డు, తక్కుడు, తగులుడు, తడవుడు, తలగుడు, తాకుడు, తిరుగుడు, తెగుడు, తెలుపుడు, తొలగుడు, తోముడు, త్రాగు (పు)డు, త్రుంగుడు, త్రుప్పుడు, త్రేగు(పు)డు, త్రొక్కుడు, త్రోపుడు, దంగుడు, దంపుడు, దాపుడు, దిగుడు, దిగ్గుడు, దూకుడు, దెప్పుడు, దోకుడు, దోపుడు, నఱకుడు, నఱుకుడు, నలగుడు, నానుడు, నిక్కుడు, నూకుడు, నెమకుడు, నొక్కుడు, పట్టుడు, పాఱుడు, పిలువుడు, పులుముడు, పెంపుడు, పెట్టుడు, పెరుగుడు, పేరుడు, పొదుగుడు, పొసగుడు, ప్రాకుడు, ప్రాముడు, ప్రేలుడు, మగ్గుడు, మాగుడు, మేముడు, మ్రింగుడు, మ్రొక్కుడు, మ్రోగుడు, రాపుడు, రుద్దుడు, రొంజు (౦డు, డ్టు, ల్లు)డు, వడకుడు, వాలఱుగుడు; వెద (న)కుడు, వెలుపుడు, వేపుడు, వేల్పుదు, వ్రేపుడు, వ్రేలుడు, సోకుడు.

82. - ౦డు, సం. - అంత.

కలగుండు.

83. - త; సం. -త.

తెనుగున 'యు' వర్ణాంత ధాతువులపై నిది కలుగుచుండును. మేత, కోత, మొద.

II. ప్రత్యేక పదములుగ కాన్పించినను బ్రత్యయత్వమును బొంద నారంభించినవి.

1. కట్టు; సం. కృత.

బందుకట్టు, వాకట్టు, వాడకట్టు, సజ్జకట్టు,సందుకట్టు.

2. -కడ; సం. కృత.

i. దేశార్థము:

అఱకడ, మింగడ, మీగడం మీనడ, ముంగడ, లోగడ,వలకడ, డాకడ, వెలిగడ, ఇడుగడ, ఎదురుగడ, కుఱుగడ, తలగడ, తల్గడ, (తలాడ), విడుగడ (నిర్వ. VII.12)

ii. కాలార్థకము:

పెందలకడ, రేపకడ, లోగడ.

iii. భావార్థకము:

తేగడ, బరగడ, నిలుకడ, నిల్కడ, పోకడ, రాకడ, ఎత్తుగడ, ఏడుగడ, ఏడ్గడ, కట్టుగడ, కాపుగడ, చేరుగడ, తరుగడ, తేఱుగడ, దిద్దుగడ, పన్నుగడ, విడుగడ, విఱుగడ, చిలుకడ.

iV. వస్త్వర్థము: