పుట:Andhra bhasha charitramu part 1.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75. ఇరి; సం. ఇ + - తి

అలిపిరి, ఉలిమిరి, కసిమిరి, కింకిరి, కింగిరి, చలిమిరి, తిమిరి, తిమ్మిరి, నసిమిరి, నింపిరి, పొంపిరి, పందిరి, పిప్పిరి, బవిరి, బవ్రి, మాదిరి, మాద్రి, వలిపిరి, వాపిరి, వావిరి.

76. - ఇలి; సం. ఇ + - తి.

ఆర్మిలి, ఆవిలి, ఇక్కిలి, ఇరివిలి, ఒంపిలి, ఒదిపిలి, ఒత్తిలి, ఒందిలి, ఓకిలి, కమికిలి, కొడి(ణి)దిలి, గబ్బిలి, గాదిలి, గుప్పిలి, గుబిలి, గుమిలి, గ్రుక్కిలి, చిందిలి, చికిలి, చిమ్మిలి, చీకిలి, చెక్కిలి, చొక్కిలి, జంగిలి, జాబిలి (ల్లి); జగిలి, జుట్టి (త్తి)లి; తొంగిలి, తొండ్లి, సక్కిలి, నర్మిలి, నుచ్చిలి, నెంజులి, నొచ్చిలి, పట్టిలి, పందిలి, పికిలి, పిక్కిలి, పిడికిలి, పింపిలి, పుక్కిలి, పుడిసిలి, పుణికిలి, పెండిలి, పెండ్లి, పొంగిలి, పొదిగిలి, బడిలి, మాగిలి, మించిలి, ముచ్చిలి, లొడితిలి, వాకిలి, వావిలి, వింజిలి, వేవిలి, సందిలి,

77. - ఇవము; సం. ఇ + ఉ + క.

ఉక్కివము.

78. - ఇవి; సం. ఇ + ఉ + ఇక.

గెలివి, తనివి, తన్వి, తెలివి, నిడివి, విరి(ఱి)వి,

79. - ఇసము. సం. త్య.

బానిసము, బారిసము.

80. ట; సం. -త.

'ట'ను ఋధాతువునకైనను చేర్చవచ్చును. క్రుంగుట (శ. ర. లో లేదు); పాండు iv.48; కొనియాడుట (ఉ. హరి. iv. 69 అర్థ భేదము.)

81. - డు.

సం. - త + ఉక.

భావార్థమున 'ట' వచ్చు చోట్లనెల్ల 'డు' రావచ్చును. శబ్దరత్నాకరములో నీ క్రింది శబ్దములు మాత్రము భావార్థక డు - ప్రత్యయాంతములు చేర్పబడినవి.

అమ్ముడు, అఱుగుళ్లు, అఱువుళ్లు, అలుకుడు, అదుముడు, ఇంకుడు, ఉగ్గుడు, ఉప్పుడు, ఎక్కుడు, ఎగుడు, ఎనుపుడు, ఏరుగుడు, ఏకుడు, ఏదుడు, ఒత్తుడు, కక్కుడు, కదలుడు, కప్పడు, కాగుడు, కాపుడు, కిముడు, కుట్టుడు, కొలుపుడు, క్రాంగుడు, క్రుక్కుడు, క్రుమ్ముడు, గిల్లుడు, గీఱుడు, చిమ్ముడు, చిలుకుడు, చీరుడు, చీఱుడు, చెప్పుడు, చేపుడు, చోపుడు, జరుగుడు, జరుపుడు,