పుట:Andhra bhasha charitramu part 1.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii. సం. సందేహ = తె. సందియము;

iv. 'య' ఒత్తుగల శబ్దములకు స్వరభక్తి కలుగుట: కన్యా = కన్నియ; విద్యా = విద్దియ ; పద్య = పద్దియము ; పుణ్య = పున్నియము.

v. వర్ణవ్యత్యయము కలుగుట: పాయసము = పాయెసము = పాసెయము = *పాసియము, పాసెము; యజ్ఞోపవీతమ్ = జన్నిదము = జందియము.

(ఆ) కొన్ని 'ఇయ' లు '- ఎ' లుగా మాఱవు.

డిగ్గియ, డిగియ, తునియ - పరియ, పఱియ, పుల్లియ, ముడియ, సుకియ, సుడియ, చఱియ, చెలియ, తునియ, దిగ్గియ, సకియ.

(ఇ) కొన్నియెడల '-ఇయ' - 'ఇ' గ మాత్రము మాఱును.

సరియ (సరి); కాళంజియ (కాళంజి); ఉన్నియ (ఉన్ని); జన్నియ (జన్ని); ఉద్దియ (ఉద్ది); చక్కియ (చక్కి); చెలియ (చెలి);

(ఈ) కొన్నియెడల '-ఇయ' లు 'ఎ' లుగా మాఱి తాము లోపించినవి, దొన్నె, పగ్గె, సందె, జంకె

(ఉ) కొన్ని 'ఇ య' లు 'ఇ' లుగ మాఱి తాములోపించినవి:- గబ్బి, దొమ్మి, బ్రమ్మి, పిచ్చి, జవా (వ్వా) (ది); గంజి, పుంజ, బావంజి, ముంజి, గజ్జి, గూటి, సొంటి, పొటి, పొట్టి, దట్టి, దట్టీ, బుట్టి, పుట్టి, మేడి, గండి, పిండి, ఇత్తడి, కంబడి, కావడి, కైరవడి, కొడి, కోడి, గరుడి, పల్లటీ, దుప్పటీ, గుమ్మడి, జంజాడి, జముదాడి, తక్కిడి, మందడి, లౌడీ (ణి), గిడ్డి, కామంచి, జడ్డి, దొడ్డి, కడ్డి, గుత్తి, తిత్తి, పొత్తి, మిత్తి, అళది, హళది, చెయిది, సంది.

(ఊ) కొన్ని '-ఇ'యలు 'ఎ' లుగను 'ఇ' లుగను గూడ మాఱును; జోలియ (-లె, -లి); టెంకియ (-౦కె, - ౦ కి).

(ఋ) కొన్నియెడల '-ఇయ'లోని 'ఇ' లోపించి, యకారము వెనుకటి వర్ణముతో సంయోగము నొందును.

కన్నియ (కన్య); పళ్లియము (పళ్యము); ముత్తియము (ముత్యము); దివియ (దివ్య); విడియము (విడ్యము); వీడియము (వీడ్యము).

(ఌ) 'తదియ' 'తద్దె' యగునుగాని, 'విదియ' 'విద్దె' గా మాఱదు.

73. - ఇయన - ఎన; సం. ఇక + అన.

కందియన (- ౦దె -); గొల్లియన (-ల్లె-).

74. - ఇరము. - సం. - ఇత.

జాపిరము, తీవిరము.