పుట:Andhra bhasha charitramu part 1.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


44 - రు.

1. చ, ర, శ, ష, స లంతమందుగల ధాతువులు: అమరు (మ్రశ్, మ్రష్); ఆరు (ఆస్, ఆట్); కసరు (కర్ష్, ఘర్ష్); కోరు (కర్ష్); చూరు (శుష్); తిము(వు)రు (త్వర్); పేరు (ప్రా. పుఅర్); వారు (వ్రశ్చ్).

2. ధాతువు: కేరు (గౄ); తలరు, తూరు (స్తృ); తీ(తూ)రు (తృ); పేరు (పౄ).

3. ఆమ్రేడితధాతువు: అడ(ద)రు, అదురు (అట్ అట్).

4. ధాతువు+కృ: ఎగురు (ఏధ్, ఏష్).

5. ధాతువు+ఇష్: ఎదురు (రుధ్); కమరు (క్లమ్); చిదురు, చీఱు, గీఱు (ఛిద్); తొడరు (తుడ్); పదరు (పద్); పదురు (పత్); విదురు, బెదరు, పీరు (భిద్); మదురు (మద్); ముదురు (వృధ్); ముసరు, మూరు (ముష్).

6. ధాతువు+అట్: ఎ(ఏ) సరు (ఏష్); కొసరు (కుంచ్); క్రుమ్మరు (క్రమ్); చమరు (శమ్); పొకారు (భాజ్); ముసరు (ముష్); వందురు (వ్యధ్); వద(స)రు (వద్).

7. ఉపసర్గము+ధాతువు: ఉదరు (ఉద్+అట్); నిము(వు)రు (నిర్మృశ్).

8. ఉపసర్గము+ధాతువు+ఇష్: పారు (ప్రవృత్); వేస(సా)రు (వ్యస్).

9. ఉపసర్గము+క్రియాజన్యవిశేషణము+అట్: ఒ (పొ-,మొ) నరు (ఉపపన్న).

10. క్రియాజన్యవిశేషణము: చెదరు (ఛిద్ర).

11. క్రియాజన్యవిశేషణము+ఇష్: ఎడరు (విద్ధ).

12. క్రియాజన్యవిశేషణము+అట్: కదురు, కొదరు (ఖదిత, కృత); కుదురు, కూరు (కృత).

13. వద్ధితరూపము+కృ: డాకురు (దక్షిణ+కృ); చమరు (చపేట+కృ).

45 - ఱు.

1. ఋ, శ, ష, స, లంతమందుగల ధాతువులు: అ(ఆ)ఱు (అర్శ్); ఏమఱు (విస్మృ); కేఱు (కష్); దూఱు (దుష్); మాఱు (మ్లశ్).

2. ఆమ్రేడితధాతువు: ఈడేఱు (ఇష్ ఇష్); దద్దఱు (త్వర్‌త్వర్).