పుట:Andhra bhasha charitramu part 1.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(దృశ్); పరియు (పృష్); పాయు (భజ్, పాంస్, అపాస్); పొఱ (ఱి)యు (పృష్); పొలయు (ప్లుష్); పోయు (ప్రోక్ష్, ప్రోష్); మలయు (మ్లశ్); మురి(ఱి)యు (మృశ్); రే (ఱే)యు (రిచ్, రిజ్); రోయు (రుష్, రుశ్); లాయు (లష్, లస్); వ్రేయు (వ్రశ్చ్).

2. ఉపసర్గము+ధాతువు: ఆరయు (ఆరక్ష్, ఆలక్ష్); ఉరి(ఱి)యు (ఉద్రిచ్); ఉలియు (ఉద్రస్); ఒడియు (అవధృష్); ఒలయు (ఉల్లస్); నెర(ఱ)యు (నిర్విశ్); బిగియు (వికృష్, వికృశ్); బెడియు (విదృశ్, విధృష్); బెర(ల)యు (విరచ్); మెఱయు (విలస్); వలయు (అవలష్); విరియు (విరచ్); వెలయు (విలస్); వలియు (వ్యరిశ్).

3. ఉపసర్గము+ధాతువు+య: పెనయు (పి, అపినద్ధ).

4. ధాతువు+ఇష్య్: ఎగ(వ)యు (ఏధ్); కదియు (స్కద్); కనియు (క్లమ్); కమియు (క్రమ్, క్లమ్); కవియు (క్రమ్); గునియు (క్వణ్); చదియు, చిదియు (ఛిద్); చెనయు (స్విద్); చెలయు, చెలయు (చల్); జడియు (చల్, శ్లథ్, శ్రథ్, శబ్ద్); నోయు (నుద్); పడయు (పత్, పద్); మదియు (వృధ్).

5. అవ్యయము+ధాతువు: ఎడయు (పృధక్కృ); సొలయు (సు-అలస్).

6. తుదియచ్చుపై యడాగమముగలుగుట: ఒడియు (ఉడ్డీ); మాయు (మ్లై, మ్లా); మి(వి)డియు (విడీ); ఒలియు (ఉల్లూ).

7. ధాతువు+య:కోయు (కృత్); క్రాయు (గ్రివ్య్); మోయు (వహ్య్); బులియు (బ్రూయ), చూ, హిం, బూలా; బోల్; చూ. తెనుగు: బొల్లిమాట.)

8. విశేష్యము+స్య: తడయు (తటస్థా); మొరయు, మ్రోయు (ముఖరస్).

9. కృద్రూపము: తనియు (తృష్ణా); పులియు (పూతి); ముగియు మొనయు (ముఖ).

10. క్రియాజన్య విశేషణము+ఇష్య: వడియు (ఉదిత).

11. విశేషణము+ఇష్య: తెలియు (ధవల).

43 - య్యు.

ధాతువు+య:క్రయ్యు (కృష్) గ్రొయ్యు (కృశ్, క్రుంచ్); డా(ద)య్యు (దృష్); డు(దు)య్యు (దుష్); త్రెయ్యు (త్రక్ష్); బ్రుయ్యు (భ్రశ్).