పుట:Andhra bhasha charitramu part 1.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ధాతువు+ఇష్:ఎచ్చిఱు (ఏష్); కమ్మఱు (క్రమ్); గివుఱు, గీ (చీ-,జీ-)ఱు (ఛిద్); జాఱు (సృ, స్రవ్, శ్లథ్): తా (తే)ఱు (తౄ).

4. ఉపసర్గము+ధాతువు:పాఱు (ప్రసృ).

5. ఉపసర్గము+ధాతువు+ఇష్; పాఱు (ప్రవహ్).

46 - ఱ్ఱు.

ధాతువు: జుఱ్ఱు (జుష్); కుఱ్ఱు (కూజ్, ఘుష్).

47 - లు.

1. క్రియాజన్య విశేషణము: అగ(గు)లు, ఔలు (ఖాత, ఘాత); అడ(ద)లు (చూ. హిం. డర్); ఈసడిలు (శిథిలిత); ఎచ్చిఱిలు (ఏషిత, వృధిత); ఎడలు (*భిత్త, భిన్న); ఏలు (ఏధిత); ఒరలు, రోలు (రుదిత); కదలు, కుదులు (స్థలిత, స్కదిత, స్కుదిత; కనలు కనారిలి (చూ. సం కనల); కమలు, కాలు, కుములు, కుమారిలి (క్లమిత); కుదికిలు (స్కుదిత); కుప్పతిలు (గూర్విత); కుమ్మరిలు (కుంఫిత), కుసులు, కూలు (కుంచిత); కెరలు (కూజిత, క్రుద్ధ); క్రాలు (క్రాంత); క్రుంగిలు (కుంచిత); క్రోలు (గృహీత, కృష్ట); చిందిలు, (ఛిందిత); చికిలు (చకిత); చిటిలు, చిట్లు, దీ(డీ)లు, సడలు (శిథిల); చీలు (*ఛిత్త, ఛిన్న); చతి(ది)కిలు (సదిత); చాలు (సాధిత); తగు(వు)లు, తౌలు (స్థగిత); తర(ఱ)లు, తర్లు, తెర(ఱ)లు (తరిత); తూలు (ధూత); తొడికలు (త్రుట్కృత, త్రుటీకృత); తొట్రిలు (తోత్కృత, దుష్ట), దొంగిలు (తస్కరిత); నొగులు (నుద్+కృత); పగులు (భక్త); పిగులు, పీలు, పెక(గ)లు, పేలు (*భిక్త, భిద్+కృత, భేదీకృత); పొదలు (వర్ధిత); పొరలు, పొర్లు (ప్రవర్తిత); పొగు(వు)లు; (*ప్లుష్+కృత); ప్రేలు(*బ్రూత, *వదిత); బ(వ)డ (ద,దు)లు, విదలు (బాధిత, భిద్+కృత); మా(మ్రా)లు, (మ్లాత); ముంగిలు (ముఖరిత); ము(మ్రు)చ్చిలు (ముషిత); రగు(వు)లు (రంజిత); ఱోలు (రాసిత); వఱలు (వర్తిత); వసులు (అపసృత: భిద్+కృత); వా(వ్రా)లు (అవపాత); వీలు (విహిత); విదులు, వెడలు, వెలలు (వికృత, వికల); వెలికిలు (బహిష్కృత); వే (వ్రే)లు (విధృత, వివృత); సోలు (శ్రమిత, శ్రాంత).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: ఆగుబ్బతిలు (ఆగూర్విత).

48 - ల్లు.

1. క్రియాజన్య విశేషణము: అల్లు (వల్లిత, వేల్లిత); ఉడికిల్లు (ఉష్ణీకృత); ఎగసిల్లు (ఏష్కృత); కంటగిల్లు (కంటకిత); క(త)త్తరిల్లు (త్వరిత);