పుట:Andhra bhasha charitramu part 1.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


3. క్రియాజన్య విశేషణము: ఇడు, ఇముడు (హిత, *హింత); ఓడు (అవహత); చిముడు, (ఛిందిత,* ఛింత్త); చెడు (*ఛిత్త, ఛిన్న); తొడు(ధృత); వాడు (మ్లాత, మ్లష్ట); విడు (*భిత్త).

4. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: ఊడు (ఉత్పతిత, ఉత్పాటిత, ఉత్పాతిత); నిగుడు, నివుడు (నిర్హాపిత, నివృత్త, నిర్వృత్త); నెగ (వ)డు (న్యక్కృత, నిష్పృత, నిర్వర్తిత); పొగ(వ)డు (ప్రగీత, ప్రకృష్ట).

5. ఉపసర్గము+ధాతువు+అట్: ఊరడు (ఉచ్ఛ్వస్+అట్).

6. తద్ధితరూపము: కూడు (చూ. కూట).

7. అవ్యయము+ధాతువు: తెగ(వ)డు (ధిక్కృత).

23.-డ్డు.

1. క్రియాజన్య విశేషణము: అడ్డు (అడ్డ).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: ఒడ్డు (ఉపహిత).

24.-ణు.

తద్థితరూపము: తెనమణు (శయన).

25.-తు.

క్రియాజన్య విశేషణము: పాతు (పాతిత).

26 - తు.

క్రియాజన్య విశేషణము: చాతు (సజ్జిత).

27 - త్తు.

1. క్రియాజన్య విశేషణము: అ(హ)త్తు (భక్త); ఎత్తు (ఇత); నత్తు (*నద్,*నత్త. చూ. నదన, నాద); మెత్తు (మృత్త, మృదిత); మొత్తు (ముష్టిత, మృదిత); రుత్తు (రుద్ధ).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: ఒత్తు (ఉపహత, ఉద్ధత, ఉద్వర్తిత).

28 - దు.

1. ధాతువు: అలదు (ఆర్ద్); చాదు (సాధ్); మోదు (మృద్, ముష్టిత).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: ఊదు (ఉద్ధ్మాత).

3. అవ్యయము+క్రియాజన్య విశేషణము: చీదు (సీత్కృత).