పుట:Andhra bhasha charitramu part 1.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


29 - ౦దు.

1. ధాతువు: కందు (క్రంద్); చిందు (ఛింద్); పొందు (స్పంద్, పద్).

2. ఉపసర్గము+ధాతువు: ఒందు (ఉపపపద్).

3. క్రియాజన్య విశేషణము: కందు (క్లమిత); కుందు (కృశిత); కొందు (కృత్త); మ్రందు (మ్రక్షిత, మ్రష్ట).

30 - దు.

1. ధాతువు: ఎయిదు, ఎయ్దు, ఏదు (ఏధ్).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: సరదు (సంస్కృత, సంవృత).

31 - ద్దు.

క్రియాజన్య విశేషణము: అద్దు (అర్దిత, ఆర్ద్రిత); బిద్దు (భిత్త); దిద్దు (ధృత, తరిత); రుద్దు (రుద్ధ).

32 - ను

1. న, ణ, ల, లతో నంతమగు ధాతువులు; అను (అన్, అణ్); కను (అక్ష్ణ్); చను (చల్); తిను (తృణ్);నాసు (స్ను).

2. ధాతువు + -ను + -, - నా -, - న్ -, వికరణ చిహ్నము; కొను (కృణు); దును (ధును)

3. తద్ధితరూపము: ఆను (ఆధాన); ఈను (ఈజన); పూను (వహన);(వయన)

33 - న్ను.

1. ధాతువు + - ను - వికరణచిహ్నము: దున్ను (ధును)

2. క్రియాజన్య విశేషణము: పన్ను (*పన్న; పద్, పత్).

3. తర్ధితరూపము: ఎన్ను (హేలన); తన్ను (తాడన).

34 - పు.

సంస్కృతమున - 'ఆపయ' - అనునది ప్రేరణార్థమున ధాతువులతో జేరుచుండును. హాపయతి, విజ్ఞాపయతి, మొద. దీనిలోని - అయ - ఒక్కటే ప్రేరణార్థమునుగలిగి, - ఆప్ - అనునదియే కేవలమనుబంధమయినను, సాధారణజనులకు - ఆప్ - అనునదియే ప్రేరణార్థమున గలిగినట్లు తోచుటసంభవించెననియు, దానిని ధాతువులకు స్వేచ్ఛగా జేర్చుటవలన నుత్తరహిందూస్థాన భాషలలో ప - కారాంత ధాతువులు గొన్నియేర్పడెననియు నా భాషాతత్త్వజ్ఞుల యభిప్రాయము. ద్రావిడభాషలలోను గొన్ని ప - కారాంత ధాతువులట్లే యేర్పడియుండవచ్చును.