పుట:Andhra bhasha charitramu part 1.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16.-టు.

1. ఉపసర్గము+ధాతువు: ఊటు (ఉద్వర్త్, ఉత్థ్సా)

2. క్రియాజన్య విశేషణము: ఆటు (ఆత్త, ఆప్త); గీటు (క్షిప్త); దూటు (ధూత); దోటు (దుత్త); పొరటు (పృక్త).

3. క్రేటు (చూ. క్రేంకార); దాటు (చూ. ధాటీ).

17.-౦టు.

1. అనునాసికముగల ధాతుజన్య విశేషణము: అంటు (అఙ్త్క్); కుంటు (కుంచిత, ఖంజిత, కుంఠిత); గంటు(ఘ్నంత,హన్; ఘాత, ఖాత, ఖన్).

18.-టు.

1.ధాతువు: చాటు (సాట్).

2. ధాతువు+అట్: తెగటు (తృచ్).

19.-ట్టు

1. క్రియాజన్య విశేషణము: ఉట్టు (ఉద్వర్తిత, ఉత్థాపిత); నెట్టు (నిర్వృత్త); ఒట్టు (వర్తిత); కొట్టు (కుట్టిత; గిట్టు (క్లిష్ట, కృష్ట, ఘృష్ట); తట్టు (తాడిత, తష్ట); పట్టు (వర్తిత,పతిత); పెట్టు (వృత్త); మట్టు మెట్టు (మర్దిత). కట్టు (కృష్ట, కర్షిత); కిట్టు (కర్షిత); కుట్టు (కృష్ట, కుత్థ, కర్షిత); పెట్టు(ప్రహత).

2. తద్ధితరూపము: పుట్టు (చూ, పుత్ర); మొట్టు (ముష్టిత).

20.-౦డు

క్రియాజన్య విశేషణము, (*చూడు, శుష్ట, శుష్క); తేడు (తిష్ట, తిష్ఠిత); తోడు (ధృష్ట); పేడు (పివద్ద); మూడు (మ్లష్ట); లోడు (లూత).

21.-౦డు.

1. క్రియాజన్య విశేషణము: ఉండు (ఉషిత,*వుష్ట); చుండు (*శుష్ట, శుష్క); పండు (ఫలిత); మండు (మ్లష్ట); నండు (*పక్త, పక్వ); చెండు (ఖండిత, ఛిందిత); తండు (దండిత); పిండు (పిష్ట, వ్యధిత).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: పరుండు (పర్యుషిత).

22.-డు.

1. ధాతువు:ఆడు (అట్0; పాడు (పఠ్); పూడు(పూర్); పడు (పత్).

2. ఉపసర్గము+క్రియాజన్య విశేషణము: బెగడు, బెగ్గడు (బిజ్కృత, విహ్వలిత).