పుట:Andhra bhasha charitramu part 1.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. సంయుక్త హల్లుల నడుమ వచ్చుచేరుట: ఉదా. క్రీడించు, కేరడించు.

11. (అ) అచ్చులయందలి పరివర్తనము:

i. పదాదిని.

అ - ఉ: అదరు, ఉదరు.

ఇ - ఎ: పెఱకు,పీకు.

ఇ - ఉ: తిలకించు, తులకించు.

ఎ - ఏ: ఎసరు, ఏసరు.

ii. పదమధ్యమున.

అ - ఉ: అదరు, అదురు.

ఇ - ఇయ్: బిగించు, బిగియించు

12 హల్లులయందలి పరివర్తనము:

I.పదాదిని.

(అ) క్రొత్త హల్లు చరుట: అంచు, పంచు; అత్తు - హత్తు.

(ఆ) చ - గ - గ: చీఱు, జిఱు. గీఱు.

ౙ - ద: జడియు, దడియు

డ - ఱ: పడు, పఱుచు

త - ద: తనుకు, దనుకు

ద - డ: దక్కు, డక్కు.

ప - మ: వెఱుకు, మెఱుకు

ప - వ: వెలుపించు, వెలువరించు

ప - హ:వెచ్చు, హెచ్చు.

క్క - గ: మిక్కిలు, మిగులు

II. పదమధ్యమున.

(అ) మధ్యహల్ ద్విత్వలోపము, పూర్వాచ్చునకు దీర్ఘము: ఎచ్చరించు, ఏచరించు.

(ఆ) పదమధ్యమున క్రొత్తహల్లుచేరుట: ఉమ్మలించు, ఉమ్మలికించు.

(ఇ) పదమధ్య పరుషములు సరళము లగుట: అతుకు, అదుకు.

(ఈ) పదమధ్యహల్లులయందు మార్పులు:

క - మ: పొటకరించు, పొటమరించు

గ - వ: ఇగిరించు, ఇవిరించు.

డ - ణ: పుడుకు, పుణుకు.