పుట:Andhra bhasha charitramu part 1.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(291) రొప్పు, రొల్లు, రోజు, ఱంతిల్లు (292) లనుకు (293) లాగు (-చు), లాగించు. (294) వండు (295) వదరు (296) పరగు, వఱలు, (297) వలచు (-యు), వాలు, వాడు (298) నలియు (299) వాను (300) వాము (301) వారు (చు) (302) విచ్చు, విరియు, విజ్జు, విడు (చు), వీడు, విడ్చు, (303) విడియు (304) విను (చు) (305) విఱుగు (-చు) (306) విలుచు (307) విసుగు (వు) (308) వసరు, వీచు, వైచు. (309) వీలు (310) వెచ్చు (-మ్ము, వేగు (చు) (311) వారు, వెరజు (312) వెల (లి)యు (313) వేడు (314) వేచు (315) మఱచు వేస (సా)రు. (316) వేలుచు (317) వ్రాయు (318) వ్రేయు (319) సాకు (320) సోకు.

పై వివరించిన వర్గములలోని ధాతువులన్నియు దేశ్యములని శబ్దరత్నాకరకారుని యభిప్రాయము. వీనిలో జాలవఱకు దద్బవములనియు, నవి యుత్తరహిందూస్థాన భాషలయందువలెనే తెనుగునను వికారము నొందినవనియు, ఆ వికారము చాల నెక్కువయగుటచే వాని ప్రాకృత సంస్కృతరూపములు చాల మఱుగుపడియున్నవనియు నీ క్రింద చూపబడు చున్నది. సంస్కృతములోని ధ్వనులు ప్రాకృతమునందును, ప్రాకృతభాషలయందలి ధ్వనులు తెనుగునను నెట్లు పరిణమించుచు వచ్చినవో స్వర వ్య్త్యయముల గూర్చిన యధ్యాయమున వివరింప బడియున్నది. తెనుగు ధాతురూపములను గూర్చిన యితర విషయము లీక్రింది దెలుప బడుచున్నవి.

ధాతువులలో రూపాంతరము లీక్రింది విధముగ గలిగినవి:

1. పాక్షికముగ ననునాసికత్వము పోయి పూర్వాచ్చు దీర్ఘమగుట- ఉదా. ఇంకు, ఈకు.

2. పదమధ్యహల్లు లోపించి పూర్వాచ్చు దీర్ఘమగుట: ఉదా. తనుకు, తాకు.

3. హల్లున కనునాసికత్వము గలుగుట: ఉదా. పిక్కు, పింగు.

4. వర్ణస్థాన వినిమయము: ఉదా. కోగు, గోయ

5. సంయుక్తములైన వేర్వేఱు హల్లు లేకరూపము నొందుట: ఉదా. ఇన్మడించు, ఇమ్మడించు; మఱలు, మళ్లు, వెడలు, వెళ్లు.

6. పరుషములు సరళములుగను, సరళములు పరుషములుగను మాఱుట: ఉదా. అతుకు, అదుకు; తిద్దు, దిద్దు.

7. పదాద్యచ్చు దీర్ఘమగుట; ఉదా. ఒడుచు, ఓడించు.

8. పదమధ్యాచ్చు దీర్ఘమగుట: ఉదా ఆరటించు, ఆరాటించు.

9. పదమధ్యాచ్చునకు లోపము: ఉదా. వెఱకు, వెర్కు; ఇగురుచు, ఇగుర్చు.