పుట:Andhra bhasha charitramu part 1.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దు (8); ౦ దు (12); దు (3); ద్దు (4)

ను (17), న్ను (4)

పు (8); ౦ పు (11); పు (65), ప్పు (12)

బు (0); ౦ బు (1); బు (0); బ్బు (9)

ము (32); మ్ము (17);

యు (113); య్యు (11);

రు (73); ఱు (22), ఱ్ఱు (3)

లు (119); ల్లు (118); ళు (1); ళ్లు (8)

వు (50); వ్వు (11);

పై యంతములే యవివచ్చు తఱచును బట్టి యీ క్రింది విధముగా జూపబడినవి.

౦చు (488); దు (211); యు (133); లు (119); ల్లు (118); గు (75); రు (73); పు (65); కు (62); వు (50); ౦చు (35); క్కు, డు (34); ము (32), ఱు (28), చ్చు (22) ట్టు, డ్డు (21); ౦కు (20), ను మ్ము (17); ౦గు, గ్గు (15); ౦దు, ప్పు (12); ౦డు, ౦పు, య్యు, వ్వు (11); ౦కు (10); టు, డు, త్తు, బ్బు (9); దు, పు, ర్లు (8); జు (7), ౦జు (5); ద్దు, న్ను (4); దు, ఱ్ఱు (3); జ్జు (2); ణు, తు, తు, ౦బు, సు (1); జు, ౦తు, బు, బు (0).

పైని వివరించిన 1698 తెనుగు దేశ్యధాతువులలో నన్నియు మూల ధాతువులని చెప్ప వీలులేదు. వానియం దేక ధాతువునకు రూపాంతరములును, వానినుండి యర్థభేదములతో జనించిన యితరరూపములు నున్నవి.

దేశ్యధాతువులు.

తెనుగున దేశ్య క్రియలని శబ్దరత్నాకరమున జేర్ప బడినవి, వానికి గల రూపాంతరములు, వానినుండి పుట్టిన యితర ధాతురూపములతో నీక్రింద పొందుపఱుప బడినవి. ఇట్లు వర్గాకరింపగా 315 దేశ్యములని శబ్దరత్నాకరకారుడిచ్చిన క్రియావర్గము లేర్పడినవి. రూపమునందును, నర్థమునందును గల సామ్యమునుబట్టి యీ విభాగము చేయబడినది ఈ వర్గీకరణ మన్నివిధములను సంపూర్ణమని కాని, తృప్తికరమనికాని చెప్ప వీలులేదు. అయినను మొత్తముమీద దేశ్యములని శబ్దరత్నాకరకారుడిచ్చిన ధాతువులు 250 నుండి 300 లకు మించియుండవని మాత్రము చెప్పవచ్చును.

తెనుగునందలి దేశ్య మూలధాతువులు.

(1) అంకించు, (2) అంగవించు, (3) అంచు, అనుచు, అన్చు, పంచు, పనుచు, అనుపు, అంపు, పనుచు, పంపు; (4) అంజు, (5) అ (ఒ)౦టు,