పుట:Andhra bhasha charitramu part 1.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాల్డువెల్లు కూడ గుర్తించియున్నాడు. ఆయనమాటలివి: "ద్రావిడభాషలలో ప్రతిభాషయందును ననేక ధాతువులు, వర్గములకు వర్గములే, ఆకర్మకత్వ సకర్మకత్వ విషయమున నెట్టి భేదమును గలిగియుండవు. మూలధాతువునకు జేరుననుబంధము లందుగాని, నిర్మాణ విశేషము నందుగాని యకర్మక సకర్మకధాతువులకు భేదములేదు. అర్థమును బట్టియే యవి యకర్మకములో సకర్మములో తెలిసికొన నగును. ఉదాహరణమునకు - తమిళములో భూతకాల ద్యోతకముగ - ఇ - కారము చేరుధాతువులన్నియు నకర్మకములు, సకర్మకములు గూడ నగును. ఉదా. పణ్ణు - సక. పణ్ణుగిఱేన్, పణ్ణినేన్, పణ్ణువేన్; పేశు - అక. పేశుగిఱేన్, పేశినేన్, పేశువేన్.

రూపమునందు సకర్మకాకర్మకధాతువులకు భేదముండుట తక్కిన భాషలలో నంతగా లేదుగాని, తమిళమునం దధికముగా నున్నది. కావున నుదాహరణములను ముఖ్యముగా తమిళమునుండి యిచ్చెదను" (కాల్డువెల్: కంపే. గ్రా. పు. 450).

ఇట్లుండుటచే దెనుగు ఢాతువులను దమిళధాతువులతో బోల్చి చూచుటవలన లాభములేదు. కావున, ప్రాకృత మార్గమును బట్టినచో నేమయిన దేలునేమో ప్రయత్నించి చూడవలయును.

తెనుగు ధాతువుల నీ క్రింది విధముగ వాని యంతములను బట్టి వర్గములుగ నేర్పఱుపవచ్చును. ఆయా వర్ణముల ప్రక్క కుండలములలోని యంకె లట్టి ధాతువులు శబ్దరత్నాకరములో నెన్నియున్నవో తెలుపును. ఈ ధాతువులన్నియు దేశ్యములుగనే శబ్దరత్నాకరకారుడు పరిగణించి యున్నాడు. సాధ్యమగు చోట్లనెల్ల సంస్కృత మూలములనేర్పఱింప బ్రయత్నించిన యాతని యుద్దేశమున వీనికన్నిటికిని సంస్కృత ప్రాకృత మూలములు కానరావనియు, నవి కేవల దేశ్యములే యనియు దప్పక తలంపవచ్చును. ఈ ధాతువుల కన్నిటికిని సంస్కృత సంబంధులగు మూలముల నేర్పఱుప వచ్చునని ప్రతిజ్ఞచేయుటకు వీలులేకున్నను, నూటికెనుబది వంతుననైన మన ప్రయత్నము సఫలము కాగలదని నా యభిప్రాయము

కు (20); ౦ కు (10); కు (62); క్కు (34)

గు (5); ౦ గు (15); గు (58); గ్గు (15)

చు (35); ౦ చు (448); చు (221); చ్చు (22)

జు (7); ౦ జు (5); జు (0); జ్జు (2)

టు (9); ౦ టు (5); టు (11); ట్టు (21)

డు (9); ౦ డు (11); డు (34); డ్డు (21) ణు (1)c

తు (1); ౦ తు (0); తు (1); త్తు (9)