పుట:Andhra bhasha charitramu part 1.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృతములో 'శ్రు' అనునది ధాతువు. దానికి వికరణచిహ్నమగు - 'ను' చేర్పగా 'శ్రుణు' అయి, బంగాళీ మొదలగు భాషలలో 'నున్‌' అనునదే ధాతువయినట్లు జనులకు గోచరించుచున్నది. అట్లే తెనుగున 'కొను' 'దును, దున్ను' లు వికరణ చిహ్నమగు 'ను' తో జేరిన 'కృణు, ధును' ల వికారములని చెప్పినచో వింతగా నుండును. కాని, నేటి యార్యభాషల యందువలె గొన్ని కొన్ని ధాతువులందు వికరణ చిహ్నములు '-ను'ఒక్కటియేకాక యితరములును ద్రావిడభాషల యందును గానవచ్చుచున్నవి. ఈ రీతిగా నుప సర్గములును వికరణ సంజ్ఞలునే కాక మఱికొన్ని ప్రత్యయములును బ్రాచీనార్య భాషారూపములందలివి మేళగించి, వికారమును బొంది, నేటిభాషలలో గ్రొత్త ధాతు రూపములను బొందినవని శబ్దశాస్త్రము నభ్యసించినవారికి దెలియకపోదు.

తెనుగునందలి ధాతువులలోని తుదివర్ణము లెట్లు నిష్పన్నములైనవో, యాయా ధాతురూపము లెట్లు కలిగినవో యీ క్రింద వివరింపబడుచున్నది. క్రింది ధాతువులన్నియు శబ్దరత్నాకరమున దేశ్యములుగ వివరింపబడి యున్నవి. అవి సంస్కృత ప్రాకృత క్రియారూపముల వికారములని చూపుచు నేటి యార్యభాషలలోని ధాతువుల నిష్పత్తిక్రమమునే తెనుగుధాతువులకును జూప ప్రయత్నింతును.

ధాత్వంతముల విషయమున ద్రావిడభాషల పరస్పరసంబంధము.

ధాతువుల కొననుండు వర్ణములు ధాతువులందలివి కావనియు, నవి క్రియారూపనిష్పత్తికి దోడ్పడు ప్రత్యయములనియు గాల్డువెల్లు నభిప్రాయము. వీనిని తొలగించినయెడల మూలధాతువు కనబడునని యాతని యూహ. అట్టి బ్రత్యయముల నాత డీ విధముగ వివరించియున్నాడు.

అకర్మక సూచకము సకర్మక సూచకము
తమిళము: గు, oగు (తె. గు, గు) క్కు (తెనుగు:- oచు:-చు,
తమిళము: చు, (తె.-చు) చ్చు+(తె,-పు)
తమిళము: దు, -oదు (తె.-చు) త్తు (తె.-చు,-పు.)
తమిళము: డు,-oడు ట్టు.
తమిళము: బు,-oబు షు.

పై విధానమంతయు ద్రావిడభాషలలో నొక్క తమిళము నందును, గొంతవఱకు మళయాళము నందును గానవచ్చుచున్నది. సరళాక్షరముల కర్మకత్వమును బోధించుటయు, ద్విత్త్వపరుషాక్షరములు సకర్మకత్వ బోధకములగుటయు సాధారణముగ తెనుగు కన్నడములందు కానరాదు. తమిళ మళయాళము లందయినను నీ విధానము నియతముగ లేదు. ఈ విషయమును