పుట:Andhra bhasha charitramu part 1.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రణజనుల వ్యవహార ప్రవాహమున బడి కొన్ని సంస్కృత ప్రాకృత శబ్దములు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణవ్యత్యయముల మూలమున గొతవికారమును బొందినవి. వీనికే తద్భవములని పేరు. వీనికిని వీనిమాతృకలకును నింకను గొంతపోలిక నిలచియున్నది. కాని యీతద్భవములలో గొన్నియింకను మార్పుల నొందుచు దొల్లింటి మూలరూపములతో నెట్టిపోలికయు లేకుండ మాఱినవి. ఇట్టిపోలికలు గుర్తింపరాని శబ్దములనే వైయాకరణులును నిఘంటుకారులును దేశ్యములనిరి. ప్రాకృత భాషలలోని దేశ్యశబ్దములకును నేటి యార్యభాషలలోని దేశ్య శబ్దములకును నిటీవల భాషాశాస్త్రమున గలిగిన యభివృద్ధి మూలమున మాతృకలు కనుగొనబడుచున్నవి. ద్రావిడ భాషల విషయమున నిట్టిపరిశోధన మింకను జరిగియుండలేదు. కాల్డ్వెల్ నాటనుండియు ద్రావిడ భాషలకును నార్యభాషలకును సంబంధము లేదను నభిప్రాయము స్థిరముగ నిలుచుటచే బరిశోధకు లీవంకకు దమదృష్టిని ద్రిప్పరయిరి. తక్కిన ద్రావిడభాషల మాట యెట్లున్నను నాంధ్రభాషను గూర్చి యీ విషయమై నేనుచేసిన పరిశోధనముల ఫలితమును మఱియొక యధ్యాయమున జూపుచున్నాను. కాల్డ్వెల్ పండితు డీసందర్భమున సంస్కృతముతో సంబంధింపవని యిచ్చిన పదముల పట్టికను గూర్చి మాత్రమిచ్చట ముచ్చటించుట యుక్తము. అత డాయాపదములకు సంబంధింపని సంస్కృత శబ్దముల నిచ్చుటచే బోలికలు సరిగ గానరాకున్నవి. కాని యాపదములకన్నిటికి దగిన సంస్కృత శబ్దములను నిరూపింప వచ్చును. ఈక్రింది పట్టికలో కాల్డ్వెల్ ఇచ్చిన తమిళపదములు, ఆతడిచ్చిన సంస్కృతపదములు, వానికి సరియైన సంస్కృత పదములును వరుసగా జూపబడుచున్నవి.

తమిళము కాల్డ్వెల్ ఇచ్చిన సంస్కృతపదము సరియైన సంస్కృత పదము.
అప్పన్ పితృ అంబ:
ఆయి మాతృ మాయి (హిందీ)
తాయి మాతృ ధాత్రీ
మగన్ నూమ మహాన్
మగళ్ దుహితృ మహతీ
తలెయ్ సిరస్ తల
శెవి కర్ణ శ్రవన్
వాయ్ ముఖ వక్త్ర
మయిర్ కేశ శ్మశ్రు