పద్యం పాడడపు సంప్రదాయ విచారణ
17
లన్నీ ఒక్కొక్క వ్యక్తిప్రత్యేకమూ తన నిమిత్తమే ఏదైనా చదువు కోడమో పఠించుగోడమో జరగవచ్చునని రచయిత అనుకుని ఉండ వచ్చు గనక, ఒక్కొక్క వ్యక్తి ఆయారచనని స్వంతంనిమిత్తం చదువు కోవచ్చు, పఠించుకోవచ్చు, పాడుకోవచ్చు, ఓపికని బట్టి ఆడుతూ పాడుతూ కూడా వ్యవహరించుగోవచ్చు. అట్లానే, ఏదేనా గీతం లిఖిత రూపంలో ఉంటే ఎవడేనావ్యక్తి దానిమీద సూచింపబడే రాగ తాళాలప్రకారం దాన్ని తన నిమిత్తం పాడుకోవచ్చు. అనగా, ఒకేవ్యక్తి స్వంతభుక్తం నిమిత్తం ఎక్కడైనా లిఖితమైన మాట రచనని చేత పట్టుగున్నప్పుడు అది గద్యంఅయినా బాధలేదు, గేయం అయినా చిక్కులేదు, అందువల్ల పదంఅయినా తంటాలేదు. కాని, గ్రంధం ఒక 'నాటకం' అయినట్టయితే, చిక్కులు బయల్దేరతాయి. మొదటి సంగతి, ఉచ్చారణకర్త అన్యుడై తోచడానికి రంగం ఎక్కిన వాడేకాని తన స్వత్వం అక్కడ స్థాపించుగోడానికి ఎక్కినవాడు కాడు. రెండో సంగతి, అక్కడ తన స్వంత ఉపయోగంనిమిత్తం మాటరచన వాడుకునేటందుకు అతడు అక్కడికి వెళ్ళడు. సరికదా, వందలాది సజీపజనం తన ఎదట చూస్తూ వింటూ ఉండగా, తను, తన మాటలయొక్క ఏకోచ్చారణమాత్రమే చేసి, వాటిలోని సంగతి వాళ్ళకి బోధపరిచి, తద్వారా వాళ్ళకి తనుగా కాకుండా అన్యుడై తోచి వాళ్ళని ఆకర్షించడానికి వెడతాడు. ఈ పని చెయ్యడంలో సందర్భించేమాటలు గద్యరూపంలోనే ఉంటాయా సభాముఖాన్ని వాటిని ప్రకటించవలిసిన రీతిగురించి బాధ లేదు. ఏమంటే : తెలుగు ప్రపంచంలో జీవించి వ్యవహరించే వాళ్ళంతా తెలుగు గద్యమే వాడు తూంటారు గనక గద్యోచ్చారణ ఎందు నిమిత్తమో గద్యోచ్చారణ రీతి ఎట్లా ఉండాలో స్థూలంగా ప్రతివాడికీ విశదమే. గేయోచ్చారణ కూడా సభఎదట జరపడానికి వీలుపడే నిమిత్తం ఒక రాగంపేరూ ఒక