16
ఆంధ్రనాటక పద్యపఠనం
గేయరచయితయొక్క కర్మంకుడా తెలుగుపండితుల దృష్టిలో కాలి పోతూంటుంది. వాణ్ణి గాయకుడు అని పిల్చుగుంటే పిల్చుగోండిగాని వాణ్ణి మాటకారుల్లోకి చొరబడనియ్యకూడదు అనే వాళ్ళున్నారు. అందుకని, మాటరచయితలందర్లోకీ ఏ కొంతో అదృష్టం పెట్టిపుట్టిన వాళ్ళు పద్యరచయితలే. ఇతర విశేషాలకితోడుగా పద్యవేషంకుడా ఉన్నప్పుడుమాత్రమే ఎవడేనా మాటకారిని 'కవి' అనడానికి ప్రజలు ఒప్పుగుంటారుగాని, తక్కిన రచయితలకి చూస్తూచూస్తూ బుద్ధి పూర్వకంగా 'కవి' అనేటంత ఖరీదైన బిరుదం కట్టబెట్టలేరు. అదీ కాక, జనసామాన్యంలో గద్యరచనగురించిగాని, గేయరచనగురించిగాని చెప్పుగోడం ఉండదు. కాని, పద్యరచనవిషయంలో: అతడు పద్యాలు చేస్తాడు, పద్యాలు కడతాడు, పద్యాలు అల్లుతాడు, పద్యాలు చెబు తాడు, పద్యాలు రాస్తాడు - అంటూ వ్యవహరించుతూండడం విన బడుతుంది. 'మాట' అనేది అర్థంతో కూడిన నాదం గనక, పై మూడు రకాల రచయితలూ తమతమ రచనయొక్క సృష్టి జరుగుతూండే సందర్భంలో ఆ రచనని మొదట నాదరూపంలో సృష్టించి తరవాత లిఖితరూపంలో దాన్ని పొందుపరుస్తారో, లేక నాదంతో నిమిత్తంలే కుండా లిఖితరూపంలోనే ప్రథమంలో దాన్ని ఆవిర్భవింపజేసి పదపడి దానియొక్క ఉచ్చారణసంగతి వదిలేస్తారో తెలియదు. రెండు రకాల వాళ్ళూ ఉండవచ్చును. కాని, ఉచ్చారణ చేసినమీదటగాని మాట జీవించదు. అక్షరరూపంలో 'మాట' అనేది సుప్తం అయిఉంటుందని అనుకోవాలి.
అభిప్రాయబాహుళ్యంవల్ల గ్రంధం ఏర్పడుతుంది. వృత్తాంత ప్రాధాన్యంగల గ్రంధాలు అనేక రూపాల్లో ఉండవచ్చు- పురాణం, ప్రబంధం, శతకం, ఖండకావ్యం, నవల, కధానిక మొదలైన రూపాల్లో వీటిల్లో గద్యంగాని, పద్యంగాని ఉండవచ్చు, ఉన్నా, ఇటువంటి రకా