2. పద్యం పాడడపు సంప్రదాయ విచారణ
మానవహృదయానికి ప్రత్యక్షంయొక్క అనుభూతీ పరోక్షం యొక్క సానుభూతీ ఉన్నాయి. రసపూరితమైన హృదయానుభవమే భావోదయానికి మూలం. సంపూర్ణభావాలతోకూడినయోచన మానవ మేధయొక్క విశేషలక్షణం. ఆయోచన విస్పష్టంగా ఇతర మానవులకి ప్రకటించడానికికుడా మానవుడు నోచుగున్నాడు. యోచనయొక్క ప్రకటనకి అనేక సాధనాలు మానవుడు వాడగలడు. అటువంటి సాధ నాల్లో మాటలు ఒక సాధనం. మాటలతో రచనచేసేవాడు, తన మాటల సముదాయాన్ని మూడు రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రకటించి తీరాలి – గద్యరూపంలోనో, పద్యరూపంలోనో, గేయరూపం లోనో, గద్యరచయితకి అన్నిటితోపాటు సాధారణవ్యాకరణ జ్ఞా నమూ, పద్యరచయితకి అవన్నీ కాక పైగా ఛందోజ్ఞానమూ, గేయ కవికి అవన్నీ కాక పైగా గానతత్వంయొక్క జ్ఞానమూ ఉంటాయి-అని మనం అనుకోవడంలో తప్పు ఉండవచ్చుగాని, ఉండాలి అని కోరుకో డంలో ప్రత్యవాయంలేదు. గద్యరచయిత ఛందోగానాలలోకూడా ప్రవీ ణుడై ఉండాలనీ, పద్యరచయిత గానాచరణలోకుడా ఉద్దండుడై ఉండా లనీ, గేయరచయిత ఛందోగానజ్ఞానశూన్యుడై ఉన్నా ఫర్వాలేదనీ అను కోడం భ్రాంతి. ఏమైనా ఈముగ్గురు రచయితల్లో కేవలగద్యరచయితకి తెలుగుజనబాహుళ్యంలో ప్రత్యేకపు పేరు లేదు, గద్యరచయిత రాత నాటికీ నేటికీ అంతే. అసలు వీరేశలింగంపంతులు వచ్చేవరకూ తెలు గులో కేవల తెలుగుగద్యరచనకి మన్ననే లేదు. ఆయనేనా, ఒకపాటి వాడికి కొరుకుపడని పద్యరూపంలో రచనచేసి చూపించడంవల్లగావును, గత్యంతరంలేక ఆయన్ని 'గద్య తిక్కన' అన్నారు. అట్లానే, కేవల