ఈ పుట ఆమోదించబడ్డది
14
ఆంధ్రనాటక పద్యపఠనం
సమాధానం:–పద్యాన్ని పాలతో పోల్చారు, ఒప్పుగున్నాం. రాగాన్ని పంచదారతో పోల్చారు, పోనీ అదీ సరే అని, ఒప్పుగున్నాం. పోలికకోసం తెచ్చిన రెండు భిన్నసందర్భాల దినుసులికి సంబంధం ఉండడంవల్ల, పోల్చబడ్డవాటికి సంబంధం ఉందని స్థాపించడమే! అల్లాయితే, పద్యక్షీరంలో రాగలవణం వేసుగోకూడదని నే నన్నాను. 'రాగాన్ని లవణంతోనా పోలుస్తారు?' అని ఎదిరించారు.
'శర్కర'కి కంటె లవణానికి ఎక్కువ 'లావణ్య'మే ఉందని నే నన్నాను. పైగా, శర్కరకంటె జీవనానికి లవణమే ఎక్కువ అవసరం, అన్నాను. రెండు వేర్వేరు ఉపమానాల్ని చేరికచేసి, మళ్లీ హేతువాదంలో పడడం అక్రమం.