ప్రాతిపదిక
13
సమాధానం: - తెలుగునక్క ఏ పులిని చూసీకూడా పెట్టుగో కూడదు, వాతలు! నేను వాత పెట్టుగోమనడం లేదు. పడ్డ వాత మానుపుగోమంటున్నాను. పద్యం పాడడపు సంప్రదాయం నడిమంత్రపుసిరి. ఒక సంప్రదాయంలో లాభం వీసమూ, బాధకాలు ముప్పాతికమువ్వీసమూ అని తేలుతూన్నప్పుడు ఆ సంప్రదాయాన్ని పక్కకి నెట్టడం వాతలు పెట్టుగోవడమా ?
9. పద్యంవెళ్ళి మంచి (అను-) రాగంతో నిక్షేపంలాగ కాపరం చేస్తూంటే చూడలేక, ఆకలయిక చెడగొట్టి, దంపతులకి విడాకులు ఇప్పించి, పద్యాన్ని బోడించి క్షౌరం చెయించి కూచోబెట్టిస్తున్నా నని.
సమాధానం :- పద్యరాగసంబంధం అసలు 'కాపరం' అయి ఉంటేగదా, నేను విడాకులు ఇప్పిస్తున్నా ననడం ! సుప్ర సిద్ధుడైన కీర్తనకర్తమాటలకీ అతడే నిర్ణయించి సూచించే రాగానికీ దాంపత్యం అంటారా, అది నేను ఒప్పుగుంటాను. కాని, ఏ పద్యంఅయినా సరే, ఏ రాగంతోనైనా సరే, ఎల్లాంటి అవస్థలోనైనా సరే, కలిసి లేచిపోవడానికి నబ బులు చెప్పే నోటితోనేనా, పద్యరాగాలకి దాంపత్యం అనడం! ఇక, పద్యాన్ని నేను బోడించ మనలేదే! రాగపు సవరం పెడితేగాని పునిస్త్రీలాగ కనిపించని పద్యం అసలు బోడిదే అన్నమాట! మరి దాన్ని బోడించడానికి ఎవ్వరూ శ్రమపడనక్కర్లేదు.
10. పద్యక్షీరంలో రాగశర్కర వేసుగో కూడదని నే నన్నానని.