Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఆంధ్రనాటక పద్యపఠనం

తాళంపేరూ గేయకర్తచేత సూచింపబడిఉంటాయి గనక, ఆయారాగ తాళాలయొక్క ఆచరణలో సామర్ధ్యం కలవాడే, ఆ గేయాన్ని ఉద్ధ రించి వ్యవహరిస్తాడు. కాబట్టి, సభాముఖాన్ని గద్యోచ్చారణయొక్క విధానంగురించి తగాదా రాలేదూ అంటే, గద్య ప్రకృతిసిద్ధం గనక. గేయోచ్చారణయొక్క విధానంగురించి పేచీ రాలేదూ అంటే, గేయం రాగతాళనియమబద్ధం గనకనున్నూ, నేర్పరి కాని వాడు దాన్ని స్మరించడానికి వీలులేదు గనకనున్నూ ! కాని, పీడ యావత్తూ నాటకపద్యోచ్చారణకి పట్టుగుంది. దాని విధానానికి దారీ తెన్నూ కనిపించదు. పద్యకర్త పద్యాన్ని ఇల్లా కని అల్లా పారేస్తా డట కాని ఉచ్చారణవిషయంలో అతడికి పూచీ ఏమీ లేదుట, అందు వల్ల ఆ విషయం అతడికి తెలియకపోవడం అతడి హక్కుల్లో ఒకటిట ! పైగా, పద్యకర్త పద్యోచ్చారణక్రియలో ఎంతో స్వాతంత్ర్యం పద్యో చ్చారణకర్తకి ధారపోశాడట (తనకి చెందని సొమ్ము !). ఏమిటా స్వాతంత్య్రం అని అడగరేం ! గాత్రమాధుర్యమూ రాగాడంబరమూ కలిగిఉండడం—అల్లాంటివాళ్ళకే ఆ స్వాతంత్ర్యం. దాని ధర్మమా అని, పద్యోచ్చారణకర్తకి పద్యం అన్నా పద్యవిశేషాలన్నా ఛంద స్సన్నా స్పష్టోచ్చారణ అన్నా తెలుగుమాటరీతిఅన్నా తెలిసి తీరా లటగాని, ఎంతమాత్రమూ తెలియకుండా వ్యవహరించగల సదుపా యంకూడా ఉంది. పద్యతత్వం తెలియకుండా పద్యాస్వాదన చేశాం అని చెబితే ఎవరేనా నవ్విపోతారేమో అని కూడా కొందరు సిగ్గు పడకపోవడం ఆ స్వాతంత్ర్యంమూలాన్నే! పద్యరచయితలలోతప్ప ఆంధ్రఛందస్సు వ్యాప్తిహీనం కావడానికి కారణం ఆ స్వాతంత్య్రమే! ఇక, శ్రోతలుకుడాఅయిన నాటక ప్రేక్షుకులు : ఛందస్సు ఏమైనాసరే, కర్ణ పర్వంగా, మరీ రేవెట్టినట్టు కాకుండా అంతమాత్రాన్ని మరీ తుంచి పారేసినట్టు కాకుండా తమరి మనస్సులోఉండి తమరు చెప్పడానికి తగ్గ