పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

. ఆంధ్ర నాటక పద్య పఠ నరి మునకు జేరిన భమిడిపాటి కామేశ్వర రావుగారు సంగీతము పై దండి యాత్రకు నాయకత్వము వహించి, హృదయరంజకమగు వాద పడి వాదము జరిగినది. కామేశ్వరరావుగారు తమ వాదమును స్పష్టముగా చెప్పిరి. గ్రంథ మునే రచించి తెచ్చిరి. సారాంశ మింతియే. నాటక మభినయప్రధా నము. పదార్థ సము పేతంబగు గద్యపద్యాత్మకము. సంగీతము స్వర ప్రధానము. పదార్థసము పేతము కానక్కర లేదు. పదసంబంధముగల చోటంగూడ సర్ధవై శేష్యము సుల్లంఘించునదియ కావున నీ రెంటికి నిశ్చయమగు సంబంధము లేదు సరిగదా, సత్యము నకు వైరుధ్యము కూడ గలదు. సంగీత విద్యను నిరసించుట యీ విమర్శకు నుద్దేశము కాదు, సంగీతము పరమానంద సందాయక ము. ఆ తాకర్షకము. కళలలో నయ్యది యుత్తమోత్తమము. సర్వజన సమాదరణీయము. సర్వజన సమాదృతము. కాని నాటకళళ వేరు; సంగీతము వేరు. రెండును ప్రత్యేక వ్యక్తిత్వము కలవి. రెంటికిని నుద్దేశము వేరు. ఒండొంటితో వీనిని మిశ్రమ మొనర్చుటచేత నిందులో నొక్కటియగు నాటకకళ నశించు చున్నది, సంగీత మే నిల్చుచున్నది. అయిన దీనికింగూడ సహజశీలము పోషితమగుట లేదు. సంకరజన్మ సాక్షాత్కరించుచున్నది. సత్యమగు సంగీతమునకు తలవంపులగుచున్నవి. శృతి సంగీతమునకు బునాది. శృతి బెట్టుటతో సంగీత మారంభ మగుచున్నది. మితి బెట్టిన నిలుచు ప్రకృతి సంగీతమునకు లేదు. కాబట్టి నాటకశాలలో శృతి బెట్టుటయుంగూడ తగదు. పద్యమైనను గద్యమైనను శృతి బెట్టక చదివి యభినయ వై దధ్యముచే నర్థ విస్ఫురణము