ప్రాతిపదిక
7
సూరిశాస్త్రిగారు, శ్రీ హరి ప్రసాదరావుగారు మొదలైనవాళ్ళు నా మాటలు మన్నించి వినడం నాకు లభించింది. అటువంటిసభ్యులూ అధ్యక్షులూ నన్ను ప్రోత్సహించడంవల్లే, సభాముఖాన్ని ప్రసంగించ డానికి నాకు ధైర్యం కలిగింది, ఇప్పటివరకూ ఉంది. శ్రీ ఉమ్రే ఆలీషాకవిగారు, తెలుగునాటక పద్యాలు రాగవరసని పాడకపోతే తెలుగుకవిత్వం దెబ్బతినడమేకాక, తెలుగు నాటకప్పాకలు తగులడి శూన్యం అయిపోతాయని తమ భయం వెల్లడిచేశారు. 'కృష్ణాపత్రిక ' లో, నేను బందరుపౌరుల్ని నా పులగపు ఉపన్యాసంతో గభరాయింప చేసి తల్లకిందులు చేశా ననిన్నీ, నేను చెప్పే విడివిడినబబులు సత్యే తరం కాకపోయినా, నేను తేల్చే సారాంశంమాత్రం వాంఛనీయం కాదనిన్నీ, దాంతో ఏకీభవించడం కష్టం అనిన్నీ, అన్నారు. కాని, ఆ సభలో ఉండి, నేను ప్రసంగించేది యావత్తూ తను విని, శ్రీ గాడి చెర్ల హరిసర్వోత్తమరావుగారు తమ 'మాతృ సేవ' పత్రిక 13-6-1924 తేదీగల సంచికలో 'నాటకములు-సంగీతము' అనే శీర్షికతో ఒక ఉప సంపాదకీయం రాశారు. అప్పట్లో నా వాదన ఆయన నాకంటె స్పష్ట తరంగా చెప్పడంవల్ల నై తేనేమి, నేను గ్రంధమే రచించి తెచ్చినట్టు ఆయన గమనించడంవల్ల నై తేనేమి, ఆయన అన్నదీ ఇస్తున్నాను:
మాతృ సేవ
(సంపుటము 2 - సంచిక 17, 13-6-1924)
నాటకములు - సంగీతము
“నాటకములలో సంగీత మవసరమా? అవసరమగునేని ఎంతవర కుండదగును? అను నంశము బందరులో నటమహాసభయందు విమ ర్శకు వచ్చినది. రాజమహేంద్రవరమునందలి హితకారిణీ విద్యాలయ