వాద ప్రతివాదన
79
లేమిటి ? దాని విశేషా లేమిటి? దాన్ని నేను ఎట్లా ఉచ్చారణచేస్తే అందులోఉండే పదాలు జీవించి, పాత్రసిద్ధి జరుగుతుంది ? కవిత్వరూపం ఎటువంటిది ? వృత్తనియమాలు ఏవి? అలంకారాలు ఏమిటి? నడక ఏమిటి ? పూర్వకవిత్వం ఎట్టిది ? మొదలైన ప్రశ్నలు నటుడిమనస్సులో పుడతాయి. కాని, సంగీతనటుడు, ఏమి చేస్తున్నాడూ! పద్యంలో దొరికే కవిత్వంసంగతి అవతలపెట్టి, తనకి వచ్చిన భైరవీ, కాంభోజీ, తోడీ పద్యానికి కలిపేరీతిగురించిన నిరంతరఆలోచనలో పడుతున్నాడు. అన్యు డెవడైనా ఎక్కడేనా ఏదేనా సంగతి వేస్తే, అది రంగంమీంచి తను ఎక్కడ దొర్లించవచ్చో చూసుగుంటూ ఉండడం, అన్యుడు ఆ సంగతి అభేదిలోవేస్తే తను ఆనందభైరవిలో వెయ్యడం. ఇల్లాంటి ఎత్తులతో గానంలోనూగాక, గానశాస్త్రంలోనూ కానటువంటి వ్యవ సాయంలో ఉండిపోయే సంగీతనటుడు పద్యోచ్చారణకి ఎట్లా అర్హుడూ? పద్యం అతడి సొమ్మెట్లా అవుతుందీ?
అదీకాక, అక్కడక్కడ పద్యాలు తగుల్తూంటాయికాబట్టి, పద్యాలు రాగాలుతో అనాలిట– అల్లా నటులు శ్రమరహితంగా పాడ డానికేట రచయితలు పద్యాలు అక్కడక్కడ రానియ్యడం ! కాని, నాటకం విశేషభాగం పద్యరూపంలోనూ అక్కడక్కడ గద్యాత్మ కంగానూ ఉంటే, అప్పుడు గద్యలే పాడతారా పద్యాలు మానేసి ? పోనీండి, నాటకం యావత్తూ పద్యరూపంలో ఉంటే అంతా రాగాలెట్టి పాడడమే? అయితే నాటకం ఆడడమా పాడడమా? ఒక పార్శీకంపెనీ వాళ్లు కాకినాడలో 1916లో ఒక నాటకం అంతాపాడేశారు. కారణం ఏమంటే, ఆ నాటకకర్త నాటకమంతా ఒక రకం ద్విపదలో రాసే శాడట! కాబట్టి రాజు, మంత్రి, బంటు, రాణి, దాసి అంతా కూడబ లుక్కుని వచ్చేసినట్టు ఒకే రాగం - (ఫీలు అని జ్ఞాపకం) జోడించి నాటకపద్యపాదాల్ని సభవాళ్లమీద దొర్లించేశారు - ఖై బరుప్యాన్