78
ఆంధ్రనాటక పద్యపఠనం
మీదమాత్రమే మనసు పోతుందన్నమాట. కాబట్టి లోగడ నాటక పద్యం చదివినవాళ్లకి అందుతో చుట్టే అల్పరాగమే లక్ష్యం. ఇక చదవనివాళ్లకి సరేసరి. శృతి వెయ్యడం, ఏదో కొంత గానం చెలరేగ బోతుందని ఒక విధమైన బజానా వంటిదికదా ! పాత సరకు కాదు, శ్రద్ధ అవసరంలేని కొత్త దినుసు ప్రారంభం అవుతోంది అనే సూచన కదా! అందుకని చదవని వాళ్లూ అందుకే చెవులు నిక్కబొడుచుగుని ఉంటారు. 'మహారాజు వస్తున్నారు' అనే కేక వినబడగానే జనం దృష్టి మహారాజు వచ్చే వేపు మళ్లడం సహజంకదా! అందుకనే సంభా క్షణల్లో, ఈ వేళ హరిశ్చంద్రుడు ఎవరు వేస్తారండీ?', 'ఫలానా వారు', 'బాగా పాడతాడా, టిక్కట్టుసొమ్ముకి తిలోదకాలా?' అనే మోస్తరుగా వినబడుతూంటుంది, ఓ నలభై యేళ్లు సంగీత నాటకాలు ముమ్మరంగా జరిగాయి. సాహిత్యనాటకాల్లో చేర్చతగ్గ నాటకాలు కుడా సంగీతపరంగా చెల్లిపోయాయి, సంగీతనటులంతా ఆయా నాట కాల్లోని సాహిత్యమంతా నేర్చవలిసిన అవసరం కలిగినా తీరిపోను, వాళ్లు నేర్చిఉండేవాళ్లు, రాగస్మరణ లేకుండా భాషాభినయాల జాగర్త పడిఉండేవాళ్లు. మొదటి సంగతి, వాళ్ల భాషాజ్ఞానం పెరిగిఉండేది. దాన్ని బట్టి, నటనం—నటుడికళ, అభివృద్ధి చెందిఉండేది. సంగీత నటుల్లో వెయ్యి పద్యాలు రాగించగలవాళ్లు ఉన్నా, చాలా వాట్లకి సారస్యం గాని, భావంగాని, అర్థంగాని తమరికి ఎక్కడ తెలిసిపోతుందో అన్నట్టు తయారవుతారు. అనగా, పద్యపాదాలకి రాగరజ్జువులు బిగించి లాగుతూ పదశవాల్ని నోటితో ఈడ్చేస్తారు. కాని, ' రాగం చొరనియ్యకూడదు, అది గాయకుడి కళ, నేను గాయకుణ్ణైనా ఇక్కడ ఆకళ రానియ్య కూడదు, రా నిచ్చినా నాకూ గాయకుడికీ సాపత్యం తెస్తారు, తెస్తే - నావి పొలికేకలని తేలవచ్చు, కాబట్టి నేను పద్యాలు పఠించవలె' అని నటుడు అనుకోగలిగిననాడు, 'పద్యం అంటే ఏమిటి ? దాని లక్షణా