Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాద ప్రతివాదన

77

పై పెచ్చు అన్యకళకి ఆకర్షణ ఉందని ప్రకటిస్తూ, దాన్ని మాటు పెట్టి జనాకర్షణ చెయ్యడం తన కళకి తను శత్రువుననే సంగతి ఒప్పేసు గుని డప్పేసుగోడం. పెగా, గానం జనాన్ని ఆకర్షించడమే కాదు, పరవశుల్నిచేసి చుట్టపెట్టేసి మరి వాళ్ళని వదలదు. జనం గానలోకం లోనే ఉండడం జరుగుతుంది. నాటకానికిగాని నటుడికిగాని పరమా వధి అది కాదు.

పద్యం అనేదానికి రాగం అనేది ఇతరమానవహృదయాలకి దాన్ని పాకించడానికి సాధనం అని కొందరి వాదన. కాని, తన హృదయం ప్రవేశించడానికి అక్క ర్లేనిది, ఇతరమానవులగురించి కావా లనుకోడం పఠితయొక్క స్వాతిశయం. పద్యంలో స్వతస్సిద్ధంగా ఉండే నడకే ఆ పనికి సాధనం. నడిచే లక్షణం పద్యానికి సహజంగానే ఉంటూండేటప్పుడు దాన్ని పాకించడమూ డేకించడమూ కర్మం ఏమొచ్చె! నడక కవులకి ఒక ఆయుధం. ఛందస్సు వేదపురుషుడి పాదాలు. తెలుగుపద్యాలు ఎన్నోరీతుల్లో నడవగలవు. ఉన్న సాధనం గమనించక అగమ్యసాధనం మరో టేదో ఉంటేగాని వీల్లే దనడం, తెలియవలిసింది తెలుసుగోక, తెలియజాలనిది బహు స్పష్టంగా తెలుస్తోందని అనుకోడం.

కొందరు నిర్మొహమాటస్థులు అన్నారు: “ మేం నాటక పద్యాలు ప్రదర్శనానికి వెళ్లకపూర్వమే ఎరుగుదుం. చూశాం. వాటిల్లోని పదార్థం మాకు తెలుసు. అచ్చుపడ్డవి అప్పగించడంలో ఉండేవిశేషం గమనించడానికి వెళ్లం మేం. వాటిని పురస్కరించుగుని నటుడు తిప్పుగోడాలుకుడా మాకు తెలుసు. ఆ పద్యానికి నటుడు తన తాలూకు గాంధర్వం ఎంతవరకు ఉచితంగా అర్థభావాభినయాలకి భంగం రానీకుండా లుంగచుట్టగలడో చూడాలని,” అని. అనగా, పద్యంలోని పదాలమీద వాళ్లకి గణ్యత నశించి, నటుడి కంఠం