Jump to content

పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ఆంధ్రనాటక పద్యపఠనం

కాదు. అంతకు పూర్వమే స్వయంగా తనో, లేక తనకి నచ్చిన అన్యుడో సృజించినవి. అనగా, ఆ పదాలు గాయకుడు ఆ క్షణంలో సృష్టించే కవిత్వం కాదు. కాని, గానం దారి వేరు. గానానికి వర్త మానమేకాని భవిష్యం లేకపోవడంవల్ల, ఎప్పటి గానం అప్పుడే సృజింపబడాలి, ఎవరి గానానికి వాళ్ళే రూపం ఇయ్యాలి. ఒక కవి రచించిన పదాల్ని మనం మరొకరితో చెప్పడానికి వీలుంటుందిగాని, ఒక గాయకుడి రాగం మనం మరొకరితో మనివిచెయ్యడం అసాధ్యం. కాబట్టి, రాగం అనేది అదివరకే రచింపబడి నిర్ణితమై వ్యవహరించడా నికి వీలైన ఆకారంలో ఏ సీసాలోనో ఉన్నట్టు - కాస్తంత రాగం కలుపుగుంటేం - అనడం, గానంయొక్క మహోత్కృష్టలక్షణం విస్మరించడం.

మరి కొందరు మొహమాటం విడిచి : కవిత్వం ఎంత గొప్ప దైనా పద్యాన్ని పఠించి ఊరుకుంటే బోసిగానూ బోడిగానూ ఉంటుంది. కాబట్టి పద్యవైధవ్యం తొలగించాలంటే రాగాలంకరణ విధాయకం. అందుచేత నాటకరంగంమీద నటుడు పద్యాలు పాడాలి-అంటారు. ఆంధ్రపద్యాన్ని బోసి, బోడి అనడం ఆంధ్రఛందశ్శాస్త్రానికి శూన్యం పెట్టడమేకాక, వెయ్యేళ్ళ కృషిమీద వెల్తిమాటాడి నోరు పారేసు గోవడంకుడానూ! అయినా, పుట్టువితంతువులైన ఆంధ్రపద్యాల వైధవ్యం తప్పించడానికి, వీరేశలింగంపంతుల్ని మించాలని చూసే ఉత్సాహవంతులు ఉండగలరు. చెడ్డరాగం, వాళ్ళు, తీసుగురానియ్యరు. అదీ వితంతువే! మంచి రాగానికి ఆకర్షణ ఉంటుంది. అదీ కాదు. ఆకర్షణగల రాగమే మంచిది గనక అల్లాంటిదే పట్టుగొచ్చి కలపాలని వాళ్ళ పట్టుదల. కాని, ఆకర్షణశక్తి ప్రతికళకీ ఉంటుంది. నటుడి కళ నటనం. నటనంమూలంగా ఒకడు జనాన్ని ఆకర్షించినప్పుడే అతడి నటనం ఒకకళ. అట్లా చెయ్యలేక, చెయ్యలేనివాడు ఊరుకోక,