80
ఆంధ్రనాటక పద్యపఠనం
లోంచి రాళ్లు దొర్లించినట్టు! నాటకం జరుగుతూన్నంతసేపూ శృతి మోగుతూనే ఉంది. తబలా వాగుతూనే ఉంది. ఏ వృత్తరూపమో ఒకటి పదునెట్టి ఒక నాటకకర్త తెలుగులో నాటకం రాస్తే, అది పాడ డమేనా, ఆడడమా ?
కొందరు : గానం 'అమ్మయ్య' అనిపించి శ్రమోపశమనం చేస్తు దిగనక పద్యం రాగం తియ్యాలి, అన్నారు. నాటకకర్త శ్రమో పశమనంగురించి చాలా జాగర్త పడతాడు, అందుకనే, కధలో, ఘట్టాల్లో, ఉదంతాలలో, పాత్రల్లో, భాషలో - రకరకాల వైవిధ్యం గమనించి మరీ నిర్వహిస్తాడు. గంభీరరంగంతరవాత తేలికరంగం అందుకనే, అంక, రంగ విభజన అందుకనే - అనగా అప్పుడప్పుడు తెర పడుతూండడం, అన్ని పాత్రలూ ఒకరే ధరించక పాత్రకి ఒకరుచొప్పున ధరించడం అందుకనే. పైగా, పద్యం జరిగేకాలంలో రాగం ఎట్లా అని మన విషయంగాని, నాటకరంగాన్నించి గానాన్ని ఊడ్చి పారెయ్యాలని ఎవరూ అనలేదు, నేనూ అనను. రంగాలమధ్య, నాటకం రక్తి చెడకుండా, కవనగానరసజ్ఞులు మెచ్చేలాగ, గాయకుణ్ణి పెట్టి, అతడిచేత ప్రదర్శనశ్రోతలకి గానం ఇప్పించవచ్చు. నాటకసమా జానికి ఒక సార్ధకగాయకుడు చాలు. చిత్రకారుడు ఒకడు ఉండడం లేదూ! అతడు అదివరకే చిత్రించిన తెరలు ప్రదర్శనంలో చూపి స్తున్నారుగాని, పద్యం జరిగే క్షణంలో నటుణ్ణి, యధోచితంగా అభిన యిస్తూ, తెరలు చిత్రించమంటున్నారా?
కొందరు కళాభిమానులు : హరిదాసు పద్యాలుపాడి రక్తి కట్టించడంలేదుటండీ, పాడ్డంలో ఉంటుంది మజా ! అనేస్తారు. కాని, జరిగినట్టు నమ్మబడే సంగతి చెప్పేవాడు హరిదాసు, అప్పటికప్పుడు జరుగుతూన్నట్టు భ్రమింపచెయ్యడానికి రంగం ఎక్కేవాడు నటుడు. హరిదాసుమాత్రం అప్పుడప్పుడు నటించడా అంటే, మానసికంగా,