పుట:AndhraRachaitaluVol1.djvu/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వీరు విజయనగరము మహారాజుగారి గానకళాశాలలో 1913 లో బ్రధమాచార్యులుగా బ్రవేశించి 1936 వరకు సక్రమముగా నిర్విహించిరి. నాడు అధ్యాపకులుగనున్న శ్రీ ద్వారము వేంకటస్వామినాయుడు గారు--ప్రధానాచార్యులు. ఇపుడీ పయి ననుకొన్న విషయమంతయు ఆదిభట్ట నారాయణదాసుదారి జీవితములో నొక కళాభాగము. ఇక నామహాకవి రచనా విశేషములు:-

అచ్చ తెలుగు పొలుపులు నారాయణదాసునకు దెలిసినంతగా మరియొక యాధునిక కవికిగాని, ప్రాక్తన కవులయిన కూచిమంచి తిమ్మన, మున్నయినవారికి గాని తెలియవని చెప్పివేయుటకు దఱచుగా సాహసము కలుగుచుండును. అబ్బా! తెలుగుపై నెంత నిబ్బరపు బ్రేముడిగల వ్యక్తి నారాయణదాసు!

గీ. మొలక లేతదనము, తలిరుల నవకంబు,
మొగ్గ సోగదనము, పూవుతావి,
తేనె తీయదనము తెన్గునకే గాక
పరుష సంస్కృతాఖ్య భాష కేది?

సంస్కృతములో నీయన కవిత బహుమనోహరముగా నుండును. 'ఉమరుఖయ్యాము' సంస్కృతాంధ్రములలో ననువదించి "ఫిడ్జిరాల్డు" ఆంగ్లముతో, పారశీకమూలముతో వెలువరించిన వీరికృతి తెలుగు వాజ్మయములో సుస్థిరముగా నిలబడునది. దాని తెనుగుపీఠికలోని యీభాగము పరికించుట యవసరము. ఈ మహాకవి తెనుగు వచనరచన సొంపుల కది మహోదాహరణము కాగలదు.

"ఉమరుకయ్యా మల్లిన మాటవన్నికంబట్టి యామేటి మాటకారి చదువరి వేల్పుల నెఱింగించుటకై పన్నిన గుడిబొమ్మలవలె వేల్పునెడ నెఱకువగలవారి కుండదగిన తగులే వెఱ్ఱ్నీళ్ళనియు వేల్పున్మత్తఱుల వేడుకొను తలంపే యక్కలు ద్రావించుమిటారి యనియు న్బిన్న పెద్ద లిరువురుకున్గూడ మిగుల గొప్పదని పుట్టించుచు జేయున దొకటి