పుట:AndhraRachaitaluVol1.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పునదింకొకటియున్గా లేనిపోని వాలకముల దాము నలచిన కూడు గూర్కుల దమతోటిపాటివారి నందఱం జెఱచియున్దామొక్కరే హాయిగానుండంగోరి పెద్దల నడువడికింగనెంతయు న్బెడదారి ద్రొక్కమని గోటునందెగనీల్గుచు బ్రాజదువుల బిక్కపెట్టి గ్రుడ్డెద్దు చేల బడునట్లు ఱువ్వి రోలుచు లోలోన జెడుపను లెన్నెన్నో చేయునాలి ముచ్చు పొగరు బోతులపరువు బయలుపెట్టి తనతోటిపాటివారికి మంచివెరవు నేర్పుటయే యని నాచేత వెల్లడింపించు నాయిలువేల్పు ప్రొద్దు న్గొని యాడుచు నుమరు కయ్యాము పద్దియమ్ములకు వివరముగా నాయల్లిన యీ తెలుగు పద్దెముల న్వేల్పునుడి జోలినంతయును లేని నాటు పాటి మాటలతోడనే యిదివఱకే మాటలల్లువారు న్గూర్ప దొరకన దెగింపని పట్టుదల న్టొంటి పెద్దలనుడివడికట్లొక్కింతయు న్దప్పకేరికైన నిట్లిపారసి నుదుల వివరించు నాటుమాటలం బన్ననిక నలవికాని తెన్నుపంగూర్ప గల్గితినని చాటుచు మఱియు మొట్టమొదట వెగటుగా దోచిన దిను సైనం జవి చూచినకొలంది నలవాటుమై నింపుగాక మానదు కనుక నోర్మిగల మంచి చదువరుల కీ నాపన్నిక కొనముట్ట నా రనసికొలది జవిగొల్పక తీరదను నిండునమ్మిగ నింతతో నీప్రాంత ముగించు నాడను"

అచ్చ తెనుగు రచన యింతస్వాధీనము చేసికొన, రచయితలు చాల దక్కువగా నుందురు. వచనమేకాక పద్యము కూడ హాయిగా సోయగ గా నడపించునేర్పు నారాయణదాసుగారితో బుట్టినది 'ఉమరుకైయాము' లోనివే కొన్ని సంస్కృతాంద్ర పద్యోదాహరణము లీయకుండ నుండ గూడదు.

గీ. నడికారునకు న్జేలకు
నడుమ వలరు తోటలోన నా విడదట సం
దడి లేదు కొద్దిగొప్పల
గొడవ మఱి బ్రదుకు కోరుకొన్నటు కడచున్.