Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొక్కొండ వేంకటరత్న శర్మ

1842 - 1915

నియోగిశాఖీయులు. జన్మస్థానము: వినుకొండ. నివాసము: చెన్నపట్టనము. రాజమహేంద్రవరము. జననము: 14-3-1842 సం|| నిర్యాణము: 1915. కవికర్తృకకృతులు: పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నృసింహము, ధనంజయవిజయ వ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహాత్మ్యము, కోరుకొండ మహాత్మ్యము, గోదావరి వర్ణనము, గోవిందమంజరి, దీక్షితచరిత్రము, యుగరాజు పర్యటనము, పోయం ఆఫ్ ది ప్రిన్స్ ఆఫ్ వేల్సు-విజిట్ టు ఇండియా - ఇత్యాదులు.

వేంకటరత్నశర్మగారు "మహామహోపాధ్యాయు" లని కొనియాడ బడిన పండితులు. చిత్తూరు మండలములోని 'తిరువల' గ్రామమున వెలసిన శ్రీ తనుమధ్యా బిల్వ నాథేశ్వరులభక్తులు వీరు. తత్కరుణాకటాక్ష సంప్రాప్త కవితావిద్యా ప్రవీణులు. గుంటూరిలో విద్యాభ్యాసము చేసిరి. చెన్నపురి రాష్ట్రీయకళాశాలలో బండితపద మధిష్ఠించిరి. రాజమహేంద్రవర రాజకీయ శాస్త్రకళాశాలయందు బ్రధానాంధ్రపండితులై ముప్పదియేం డ్లుద్యోగించిరి. కవిబ్రహ్మయనియు, అక్షరసంఖ్యాచార్యులనియు వీరి బిరుదములు. మహామహోపాధ్యాయ మహాబిరుదమందిన తెలుగువారిలో వీరు తొలివారు. "ఆంధ్రభాషాసంజీవిని" వీరు నడపిన తెలుగు పత్రిక. ప్రసిద్దిగాంచిన నాటి పత్రికలలో నిది యొకటి. అముద్రిత గ్రంథచింతామణి. కళావతి. వివేకవర్థని. శశిరేఖ మున్నగుపత్రికలు మహోత్తమ రచయితల సంపాద కత్వమున వెలువడుచుండిన దివసము లవి. నాడు 'ఆంధ్రభాషా సంజీవనీ' యన్వర్దనామముతో వెలసినది. వేంకటరత్నము పంతులుగారికి ధర్మవరము రామకృష్ణమాచార్యులు, రాయదుర్గము నరసయ్య