పుట:AndhraRachaitaluVol1.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్తి, కొమాందుర అనంతచార్యులు మున్నగు పండితకవుల చెలిమి చేకూరినది. ఈయన "ఆంధ్ర ప్రసన్న రాఘవము" ను వేదము వేంకటరాయశాస్త్రి యీ---------విమర్శించెను. నాటి విమర్శనములు స్మరణయోగ్యములు కావు. అందు తిట్టులు శాపములు కుప్పనగూరలు. విమర్శనమున సారము లేకపోలేదు. కాని వ్యక్తి దూషణములు పెచ్చుపెరిగినవి. కొక్కొండపండితుని ప్రసన్న రాఘవమును గూర్చి వేంకటరాయశాస్త్రిగా రిట్లనుచున్నారు.

"ఛందోవ్యాకరణలంకారముల కిది వేరువురుపు...రసము నున్న...పూర్వులు చెప్పినపాకము లిందులేవు......కదనము పెద్ద యక్షరముల వ్రాత కుదరకముందే వ్రాసిన జిలుగుగొలుసు ఎట్లుండునో అట్లున్నది. పాదపూరణమువలన పద్యార్థము ప్రాయికముగా నభేద్యత్వముం బొరసియుండును. పాదపూరణ ప్రయోగమందును, అదియేని చక్కగా చేతగానియందును నంతటికవి మఱి లేడు. అలంకార శాస్త్రమున జెప్పిన దోషములలో నిందు లేనిదిలేదు. అందులేనివి యిందెన్ని యేని గలవు...........తప్పుగణములు తప్పుసంధులు అద్యంత

............... ................ ................... ............... ................. ......................( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)