పుట:AndhraRachaitaluVol1.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంగాధర రామారావుగారిని దర్శించి 1879 లో నవధానము చేసెను. ఆయవధానమునకు మహారాజు మహాశ్చర్యభరితుడై మనకవివరుని గొప్పగ సన్మానించెను. ఈరీతి నీయన పొందిన రాజగౌరవములకు మేరలేదు.


చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే ఉచ్చింతకాయ వాక్కాయ సాధాకాయ తమాంజలిం. ఈ మొదలైన కొంటిరకపు శ్లోకములు వేంకటాచార్య రచితములుగా జాలమంది చదువ విందుము. ఆచార్యులుగా రొడ్డుపొడుగులుగల మానిసి. స్ఫురద్రూపి. ఆయన రసికతకు నిదర్శనములుగా గొన్ని రచన లున్నవి. "రామావధూటి తారావళి" వానిలో నొకటి, ఆ పద్యములు రసఘటికలు. రెండుదాహరింతును.


సీ. శ్రీరాధికాకుచాశ్లేషజ సంతోష

వివశుడౌ శ్రీకృష్ణవిభువ ఠెరగి

సకలవిద్యావ్యాప్తి సాధనభూతయౌ

శారదాంబకు నమస్కారములిడి

యైహికానంద ప్రవాహపూరకమైన

శృంగారరస మాత్మ నిరపుకొలిపి

మదవసామ్రాజ్య సింహాసనారుధులౌ

పురణించు రసిక శేఖరుల నెంచి


వివిధ రతితంత్రపాండిత్య భవమహారు

భవములె పదార్థములుగ నేర్పఱిచి సీస

పద్య నక్షత్రమౌలిక భావవిదుల

మనము లలరంగ గూర్తు రామావధూటి.