Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకనాటి కలలోన సకియ | నీకాలి పా

జేబులో జందెంబు చిక్కినట్లు

ఒకనాటికలలోన సకియ| కౌగిటజేర్చు

తఱి గంటె గద్దావదా కినట్లు

ఒకనాటికలలోన సకియ|మెల్లవ నాదు

గూబలో 'కొక్కొరో' కూసినట్లు

ఒకనాటి కలలోన సకియ| నీ చేతిపో

చీలోన జందెంబు చిక్కినట్లు


ఇన్ని విధముల నచ్చట నున్ననాటి

వన్నెలన్నియు గలలోన వచ్చి యిచట

గాసి గూర్చు చున్నవి నిన్ను బాసి యెట్లు

మరులు నిల్పగనేర్తు రామావధూటి!


వేంకటాచార్యులుగారు నూజవీటి శ్రీరాజా శోభనాద్రి అప్పారావుగారి సంస్థానమున విద్వత్కవి. ఈయన కభినవపండితరాయ లని బిరుదము కలదు. వీరి తండ్రి నరసింహాచార్యులుగారును కావ్యకర్తలు. పల్లవీపల్లవోల్లాసము, రుక్మిణీకల్యాణము, నీలాపనిందానిసారణము ఈ గ్రంథములు వారురచించినవే. వీరేశలింగము పంతులుగారి కవులచరిత్రలో తండ్రి కొడుకుల చరిత్రలు రెండును గలవు. మన వేంకటాచార్యులుగారు 'భరకాభ్యుదయ' మను ప్రౌడప్రబంధము సంతరించిరి. దీని ప్రాక్తవ్యము కవిచరిత్రమున సంక్ష్పించి యుంట బునరుక్తి చేయలేదు. .......... ............ .......... యాసు కవితయు నించుమించుగ ......... శోభనాద్రి అప్పారావు గారు ...... .... ........ . ............ ........... .....?( గీతలున్న స్థానములో అక్షరములు కనబడలేదు)