పుట:AndhraRachaitaluVol1.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీశ్లోకము లనంతాచార్యులుగా రెఱుగ రని యాత్మీయములుగా జదువ నారంభించితిరా?" యని పలికిరట. కుపితుడై వెడవెడ నవ్వునవ్వి యా యఱవదేశపండితుడు వేంకటాచార్యులు నెఱుగక 'ఏదీనీకు వచ్చునేని చదువుము, రచించినవాడను నేనే యిక్కడ నుండగా నాతోనే యిట్లు పలికెదవేమయ్యా! ఎవ్వరనీవు?'అని తుటారించెనట. ఇదిగో చదువుచున్నానని యేకసంధాగ్రహణమున నప్పగించిరి. వెల్లబోయి యా పండితుడు వేడుకొనెనట. మీ మాహాత్మ్యము నెఱుగనైతిని మన్నింపుడని-"


ఇట్టికథలు గాథలు వీరినిగూర్చి త్రవ్వితండములు. కని విని యెఱుగని భాషలోనివి కొన్ని పద్యములు వీరికడ నొక్కసారి చదివినజాలును. అవి యద్భుతముగా వల్లించిన పద్యముల వలె నప్పగించువారట. ఆయన ధారణాశక్తి యట్టిది. ఒక గదిలో నూఱుచెంబులు పెట్టి పుల్లతో ముందు వరుసగా వాయింపగా, గది వెలుపలనుండి విని మరల నడుమ నేచెంబుపై దెబ్బ కొట్టినను 'ఇది యీసంఖ్యకల చెంబు' అని చెప్పువారట. శబ్దగ్రహణమున గూడ నాయన కిట్టి బుద్దిసౌక్ష్మ్య ముండెడిది. దేవులపల్లి సోదరకవులు, తిరుపతి వేంకటకవులు వీరిని విని యవధానము లారంభించిరి. తిరుపతి వేంకటకవులు అవధానలతను దేశము దేశమెల్ల బ్రాకించిరి. వేంకటాచార్యులుగారు శతావధానియే కాదు. సంస్కృతాంధ్రముల లోతు చూచిన పండితుడు. తర్క వ్యాకరణములు గురుకుల కిష్టుడై కఱచెను. మొత్తముమీద జదివినదానికంటె జూపినదెక్కువ. సంస్థానముల కెక్కుట యవధానములు గావించి యాశుకవిత చెప్పు-----------తెలుగురాజు లెందఱో వీరి నాదరించి సత్కరింప ........ నెలవైన నూజువీట గాపురము. తోచినప్పుడక్కడికెళ్ళి ప్రభుని దర్శించి ....... ....... కానుకల గొని తెచ్చి ఇంట గ్రుమ్మరించి ..... ..... పీఠికాపుర మహారాజు