పుట:AndhraRachaitaluVol1.djvu/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశుధారాపరీక్షలో నీకవి మొదటితరగతిని నెగ్గినాడు. చతుర్విధ కవిత్వములందు నీకవి కడుదిట్ట. ఒకశివరాత్రి యుపవసించి లింగోద్భవకాలమున మొదలిడి తెల్లవాఱుసరికి బార్వతీశ్వర శతకము రచించిన యాశుకవివరు డీయన. రెం డేకప్రాసశతకములు మూన్నాళ్ళలో రచించి చూపిన శీఘ్రకవితాచతురుడు. యమకముగ బద్యములల్లుట, ద్విత్రిచతుష్ప్రాసములతో గవితవ్రాయుట యీకవికి వేడుక.


వీరి రాధాకృష్ణసంవాదము కృష్ణాభ్యుదయము అమరకము, తెలుగునాట బ్రచారమున నున్నవి. వెనుకటివారిలో, తాళ్ళపాక తిరు వేంగళప్ప అమరుకాంధ్రీకర్తలయం దగ్రణ్యుడు. అధునాతనులలో నమరుకము నాంధ్రీకరించినవా రయిదాఱుగురు కలరు. వానిలోనెల్ల వీరి తెలిగింపు చాల గొప్పగా నున్నది. రాధాకృష్ణ సంవాదములోని యీ క్రిందిపద్యము వీరి తాతతండ్రుల విశిష్టత కొక గుఱుతు.


సీ. శ్రీమీఱ నుభయభాషా ముఖ్య సత్కృతుల్

తజ్‌జ్ఞలెన్నగ మదంకితములు చేసి

యశముగాంచిన పేరయ మనీషిమణికి బౌ

త్రత్వంబు గార్తికవ్రతమహత్త్వ

శివమహత్త్వాద్యనేకవిధ ప్రబంధంబు

లొనరించి సత్కవి వినుతి గనిన

పారాశరసగోత్ర పావనుండగు మండ

పాక కామేశ్వర పండితునకు


మహిత పుత్రత్వమును గాంచి బహువిచిత్ర

చిత్త్రిశతి ముఖ్య సత్కృతుల్ చెప్పి మెప్పు

పడసితివి గద కులకీర్తి వర్థిలంగ

సరసగుణసాంద్ర! పార్వతీశ్వరకవీంద్ర!


పార్వతీశ్వరశాస్త్రిగారి-మనుమలు పార్వతీశ్వరశాస్త్రిగారును భాషోపాసకులై తాతగారిని మఱుగున బడిన కవితారహస్యములు కొన్ని