Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతి కందించిరి. అముద్రితగ్రంథచింతామణి పార్వతీశ్వరశాస్త్రి ప్రతిభకు నికషము. తత్పత్రికాధిపతులు పూండ్ల రామకృష్ణయ్యగారు వీరి చరిత మామూలాగ్రముగ వ్రాసిరి. అది పార్వతీశ్వరశాస్త్రి 'ఆత్మచర్య' యనదగు "హరిహరేశ్వర శతకము" నకు బీఠికగా వెలసియున్నది. పార్వతీశ్వరశాస్త్రిగారికిని, మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారికి నీపత్రికాద్వారమున బెక్కునాళ్ళు భాషావిషయక వివాద మాపాదిల్లినది.


పార్వతీశ్వరశాస్త్రిగారు మహాభక్తులు. కడకాలమున "మృత్యుంజయునకు నమస్కరింతు దరింతున్" అను మకుటముతో బద్యములు చెప్పుచు ముప్పదియైదు పద్యములు పూర్తి చేసి జీవము విడిచిరి. వీరు జీవించిన యెనుబది రెండేండ్లలో శతాధికములగు కృతులు విరచించిరి. తుదకు మిగిలిన కృతులు కూడ నెనుబదిరెండే. 19 వ శతాబ్దిలో నిట్టి యాశుకవి లేడనుటకు సందేహములేదు. పార్వతీశ్వరశాస్త్రిగారి శతక కవిత యిటులుండుననుట కొకపద్యము మూదలించి యిక విరమించెదను.


ఆక్షుల్ నిన్గనునట్లు హస్తములు నిన్నర్చుంచున ట్లాత్మ ని

న్న క్షీణంబుగ వమ్మునట్లు చెవి ని న్నాలించున ట్లాస్యమున్

దీక్ష న్నిన్గొనియాడునట్లు కరుణ న్వీక్షించి రక్షింపుమీ

సాక్షాన్మంగళ సంఘసంఘటన తృష్ఠా ! బాలకృష్ణా ! హరీ !

                           _________